మీ వ్యవసాయ విధానాలు భేష్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే వ్యవసాయ రంగంలో విశేష ఫలితాలుసాధిస్తోందని బీహార్‌ వ్యవసాయశాఖ మంత్రి డా. ప్రేమ్‌కుమార్‌ ప్రశంసించారు. ఇక్కడి పథకాలు అమలు తీరును అధ్యయనం చేసేందుకే తన బ ందంతో కలిసి మూడు రోజుల పర్యటనలకు ఇక్కడికి వచ్చినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన విత్తన ధ వీకరణ సంస్థ కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణలో ఉన్నఅవకాశాలు, మౌలిక సదుపాయాల గురించి రెండు గంటలపాటు మంత్రి నిరంజన్‌రెడ్డి వారికి వివరించారు. కొత్తఏర్పడిన రాష్ట్రమైనా కొద్దిరోజుల్లోనే గణనీయమైన పురోగతి సాధించిందని, ఇక్కడి వ్యవసాయ విధనం భేష్‌గా ఉందని బీహార్‌ వ్యవసాయశాఖ మంత్రికితాబు ఇచ్చారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు, విత్తన పరిశ్రమ అభివ ద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆదర్శంగా తీసుకుని బీహార్‌లో క షి రోడ్‌మ్యాప్‌ తయారు చేస్తామని అన్నారు. తెలంగాణ విత్తనాభివద్ధి సంస్థ నుంచి మొక్కజొన్న, బీహార్‌నుంచి విత్తనాల దిగుమతికి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాల అభివ ద్ధికి భవిష్యత్‌లో పరస్పరం కలిసి పనిచే యడానికి తాముసిద్ధంగా ఉన్నామని అన్నారు. బీహార్‌లో విత్తన పరిశ్రమ అభివ ద్ధికి కొత్త విత్తన పాలసీని తీసురాబోతున్నామని అన్నారు. అలాగే సూక్ష్మనీటిపారుదల రంగం, విద్యుత్‌రంగంలోకొత్త సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. దీనికి తెలంగాణ ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. కాగా తెంలగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి మంచి పరిస్థితులు , అవకాశాలు, మౌలిక సదుపాయాలు ఉండడం వల్లనే జాతీయ, అంతర్జాతీయ స్ధాయి పరిశోధన సంస్థలు, విత్తన కంపెనీలు తెలంగాణలో నెలకొన్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి దాదాపు 18 దేశాలకు విత్తన ఎగుమతి జరుగుతోందని, అంతర్జాతీయ విత్తన ధ వీకరణ పద్దతి ద్వారా మున్ముందు వుమరిన్నిదేశాలకు విత్తన ఎగుమతులు పెంచుతామని అన్నారు. రాష్ట్రంలో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాల సరఫరా వల్ల వ్యవసాయంలో దిగుబడులు పెరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.