‘సింగరేణి’కి దసరా కానుక

లాభాల్లో కార్మికులకు 28శాతం వాటా: సీఎం కేసీఆర్‌
  • ఒక్కో కార్మికుడికి రూ.లక్షా 899/-రూపాయిలు బోనస్‌
  • గతేడాది కన్నా రూ.40,530 అదనంగా ఇస్తున్నాం
  • సింగరేణిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తున్నారు
  • తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన పాత్ర సింగరేణిదే
  • ప్రభుత్వ చర్యల ఫలితంగా సంస్థాగతంగా బలోపేతం
  • 5 సంవత్సరాలలో బొగ్గు ఉత్పత్తిలో గణనీయ ప్రగతి
  • 2018-19లో బొగ్గు ఉత్పత్తి 64.41 మిలియన్‌ టన్నులు
  • రూ. 1765 కోట్ల లాభానికి చేరుకున్న సంస్థ
  • కోల్‌ ఇండియాతో పోల్చితే సింగరేణి ఎంతో మెరుగు
  • కేసీఆర్‌ ప్రకటనతో కోల్‌బెల్ట్‌ కార్మికుల సంబురాలు

”సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతం అయింది. యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీఒక్కరు ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సానుకూల వాతావరణం ఏర్పడింది. సంస్థ పనితీరు గణనీయంగా మెరుగుపడి రికార్డుస్థాయి ఉత్పత్తి చేయడానికి ఈ పరిణామం దోహదపడింది”
-కేసీఆర్‌

హైదరాబాద్‌:
సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ దసరా కానుక ఇచ్చారు. ఈ ఏడాది సింగరేణి లాభాల్లో కార్మికులకు 28శాతం వాటా ఇస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు. అంటే.. ఒక్కో కార్మికుడికి రూ.లక్షా 899/-రూపాయిలు బోనస్‌గా ఇస్తున్నారన్న మాట. సింగరేణిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తున్నారని కేసీఆర్‌ కితాబిచ్చారు.
గతం కంటే ఎక్కువే..!
‘ప్రతి ఏటా సింగరేణి లాభాలు పెరుగుతున్నాయి. బొగ్గు ఉత్పత్తి కూడా పెరుగుతోంది. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ అనిర్వచనీయం. 2017-18లో లాభాల్లో కార్మికులకు 27శాతం ఇచ్చాం. ఈ ఏడాది మరో ఒక్క పర్సెంట్‌ పెంచి 28శాతం వాటా ఇస్తాం. ప్రతి ఏటా సింగరేణి కార్మికులకు లాభాలు పెరుగుతున్నాయి. లాభాల్లో కార్మికులకు వాటా పెంచుతాం’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఒక్కో కార్మికుడికి 40,530 రూపాయిలు అదనంగా ఇస్తున్నారన్న మాట. కేసీఆర్‌ ప్రకటనతో సింగరేణి కార్మికుల్లో ఆనందంలో మునిగితేలుతున్నారు.
సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతం బోనస్‌ అందజేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌ చెల్లిస్తామన్నారు. దీంతో ప్రతి కార్మికుడు గత ఏడాది కంటే రూ.40,530 అదనంగా పొందనున్నారు. కార్మికుల సమన్వయంతో సింగరేణిలో రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించామన్నారు. గత ఐదేళ్లుగా సింగరేణిలో లాభాలు పెరుగుతూనే ఉన్నాయని సభకు వివరించారు. 2018-19 సంవత్సరానికి రూ.1565 కోట్ల గరిష్ఠ లాభాన్ని సింగరేణి సంస్థ ఆర్జించిందని వెల్లడించారు. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లో సింగరేణిలో సాధిస్తున్న ప్రగతి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా దక్షతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు.
మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు సంతప్తినిచ్చాయని కేసీఆర్‌ అన్నారు. పోలీసులకు వారాంతపు సెలవులు అంతసులువు కాదనీ, అయినప్పటికీ ఈ విషయమై డీజపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నామని తెలిపారు. డిసెంబర్‌, జనవరికల్లా కమాండ్‌ కంట్రోల్‌ పూర్తి కావొస్తోందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా హోం గార్డులకు మంచి వేతనం అందిస్తున్నామన్నారు.సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్‌ ఆయకట్టు ప్రస్తుతం 7 లక్షల ఎకరాలు ఉందని, ఇకపై రైతులు నిశ్చింతగా ఉండవచ్చని తెలిపారు. గోదావరి, ప్రాణహిత కలిసిన చోట నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ ఆయకట్టు పెంచాలనే డిమాండ్‌ వస్తోందని చెబుతూ దీనికి పరిష్కార మార్గంపై సమాలోచిస్తామన్నారు. మరోవైపు సింగూరు, నిజాంసాగర్‌కు నీటి కొరత ఉన్నట్లు వెల్లడించారు.
సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతం అయింది. యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీఒక్కరు ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సానుకూల వాతావరణం ఏర్పడింది. సంస్థ పనితీరు గణనీయంగా మెరుగుపడి రికార్డుస్థాయి ఉత్పత్తి చేయడానికి ఈ పరిణామం దోహదపడింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 50.47 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగారు. గత ఐదేళ్లలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది. 2018-19 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.41 మిలియన్‌ టన్నులకు చేరుకున్నది.
2013-14లో సింగరేణి సంస్థ రూ. 418 కోట్ల లాభం గడించింది. గత ఐదేళ్లలో ఇది ప్రతీ ఏటా పెరుగుతూ 2018-19 నాటికి రూ. 1765 కోట్ల లాభాన్ని సింగరేణి సంస్థ సాధించగలిగింది. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లో సింగరేణి సాధిస్తున్న ప్రగతి తెలంగాణ ప్రభుత్వ పాలనకు ప్రతీకగా నిలుస్తున్నది. కోల్‌ ఇండియాతో పోల్చితే సింగరేణి ఎంతో మెరుగ్గా ఉండటం మనందరికి కూడా గర్వకారణం. సమైక్య పాలనలోని చివరి సంవత్సరమైన 2013-14 సంవత్సరంలో కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 13,554 చొప్పున బోనస్‌ చెల్లించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో కార్మికులకు ఇచ్చే బోనస్‌కు క్రమంగా పెంచుతూ వస్తుంది. 2017-18లో లాభాల్లో 27 శాతం వాటాగా ఒక్కొక్క కార్మికుడికి రూ.60,369 ను చెల్లించింది. ఈసారి లాభాల్లో వాటాను మరో శాతానికి అంటే 28 శాతానికి పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాం. లాభాల్లో వాటా పెంచడం వల్ల ఒక్కో కార్మికుడికి రూ.1,00899 బోనస్‌గా అందుతుంది. గతేడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుక అని సీఎం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి మరిన్ని లాభాలు, విజయాలు సాధించిపెట్టాలని ప్రగాడంగా ఆశిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాల్వనే రిజర్వాయర్‌గా మార్చాలని ఆలోచించినం. ఆలోచనను అమలులోకి తీసుకువచ్చి విజయవంతగా పూర్తి చేసి శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టును కాళేశ్వరం నీళ్లు ముద్దాడేలా చేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇస్తూ… గోదావరి, ప్రాణహిత కలిసిన చోటనే మనకు నీళ్లు ఉన్నాయి. సింగూరు, నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ నింపుకుంటే మనకు ఎలాంటి సమస్య ఉండదు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాలువ మ్యాన్‌మేడ్‌ రివర్‌లాంటిది.
శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు పాత ఆయకట్టు 7 లక్షల ఎకరాలుకు సాగునీరు స్థిరీకరణ జరిగిపోయింది. ఎస్‌ఆర్‌ఎస్పీ దగ్గర టూరిజం ప్రాజెక్టు రావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నవంబర్‌ నెలలో కూడా 40 టీఎంసీల నీళ్లొస్తున్నాయి. దేవుని దయవలన వర్షాలు కురుస్తున్నాయి. సీపీఐ నేత వెంకట్‌రెడ్డి స్వగ్రామానికి కూడా నీళ్లొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ నేత వెంకట్‌రెడ్డి మెచ్చుకున్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టుతో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించారు. అప్పలు తెచ్చి సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 44 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని వెల్లడించారు.