డీలర్ల భర్తీ

రెండు నెలల్లో పూర్తిచేస్తాం: కేసీఆర్‌

ప్రజలు తాగే పాలు కలుషితమవుతున్నాయని, కల్తీ పాలను మార్కెట్లోకి ఎగదోస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కల్తీ తీవ్రత గురించి వివరిస్తూ ఆఖరుకు చిన్న పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీని పూర్తిగా అడ్డుకునేందుకు పీడీఎస్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు కల్తీలేని సరుకులు అందిస్తామని, రెండు నెలల్లో డీలర్ల ఖాళీలను భర్తీ చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.
కాగా ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం, కిరోసిన్‌ మాత్రమే ఆయా దుకాణాల్లో విక్రయించాల్సి ఉండగా ఇప్పుడవి కిరాణం షాపులుగా దర్శనమిస్తున్నాయి. సబ్బులు, సర్ఫ్‌, గోధుమలు, గోధుమ పిండి, వంటనూనె, పప్పుతోకళకళలాడుతున్నాయి. వీటిలో దాదాపు అన్నీ లోకల్‌ బ్రాండ్లే కావడం విశేషం. ప్రభుత్వేతరసరుకులు వద్దన్నా చాలా మంది డీలర్లు బలవంతంగా వినియోగదారులకు వాటిని అంటగడుతున్నారు. పలు ప్రాంతాల్లోనయితే ఇచ్చిన సరుకులు తీసుకుంటేనే బియ్యం, కిరోసిన్‌ ఇస్తున్నట్లు సమాచారం. ఇంకొన్ని చోట్ల బియ్యం కోసం వచ్చిన వినియోగదారులకు ప్రభుత్వేతర సరుకులు అంటగట్టి.. రూ.1కిలో ఉన్న రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో చాలా మంది వినియోగదారులు చేసేదేమీ లేక బియ్యం, కిరోసిన్‌ కోసం డీలర్లు ఇచ్చిన సరుకులు కొనుగోలు చేయాల్సివస్తోంది. ము ఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యా పారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సా గుతోంది. తెరచాటున జరుగుతున్న ఈ వ్యాపారంతో రేషన్‌ షాపులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తోన్న వ్యాపారులతో పాటు డీలర్లూ పెద్ద మొత్తంలో లాభపడుతున్నారు. వీటన్నింటి దృష్ట్యా రేషన్‌ డీలర్ల వ్యవస్థలోనూ విప్లవాత్మక మార్పులకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు.