వీడ్కోలివే..వినాయక

నేడే గణేశుని నిమజ్జనం…నగరంలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు
  • నిమజ్జనం రోజు ట్రాఫిక్‌ ఆంక్షలు
  • సాధారణ ట్రాఫిక్‌కు అనుమతి నిల్‌
  • నగరంలోకి వాహనాలకు అనుమతి లేదు
  • ఉదయం నుంచి రేపు ఉ.8 గంటల వరకు ఆంక్షలు
  • మెట్రో, ఎంఎంటీఎస్‌ల్లో ప్రయాణించండి
  • సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు

హైదరాబాద్‌ : నేడు జరగనున్న నిజమజ్జనోత్సవం సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అనుమతి లేదని ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. నిజమజ్జనోత్సవాల్లో భాగంగా సిటీలోని సౌత్‌జోన్‌ కేశవగిరి నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ప్రధాన ర్యాలీ కొనసాగనుంది. ఇతర జోన్ల నుంచి కూడా భారీగా విగ్రహాలు ట్యాంక్‌బండ్‌ వైపు తరలుతాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు వివరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందదర్భంగా నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపులు, బడా గణేశ్‌ నిమజ్జన ట్రాఫిక్‌ ఏర్పాట్లు, పార్కింగ్‌ ప్రదేశాల వివరాలను వెల్లడించారు. గురువారం ఉదయం 9గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8గంటల వరకు (అవసరమైతే సమయం పెరిగే అవకాశముంటుంది) నిబంధనలు అమల్లో ఉంటాయి. విగ్రహాలు తప్ప ఎలాంటి వాహనాలకు ఆ రోజు నగర రోడ్లపై అనుమతి ఉండదని వెల్లడించారు. ఆ రోజున నగరంలో సిటీ బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండవని, మెట్రోరైలు, ఎంఎంటీఎస్‌లను వినియోగించుకోవాలన్నారు.
ట్రాఫిక్‌ మళ్లించే ప్రాంతాలు
సౌత్‌: కేశవగిరి, మహబూబ్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌, ఇంజన్‌బౌలి, నాగుల్‌చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, అస్రా ఆస్పత్రి, మొగల్‌పురా, లక్కడ్‌కోట్‌, మదీనాక్రాసరోడ్స్‌, ఎంజే బ్రిడ్జ్‌, దారుల్‌షిఫా క్రాస్‌రోడ్స్‌, సిటీ కాలేజ్‌.
ఈస్ట్‌: చంచల్‌గూడ జైల్‌ క్రాస్‌ రోడ్స్‌, మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్‌, పుత్లీబౌలి క్రాస్‌రోడ్స్‌, ట్రూప్‌బజార్‌, జాంబాగ్‌ క్రాస్‌రోడ్స్‌, ఆంధ్రాబ్యాంక్‌ కోఠి.
వెస్ట్‌: తోప్‌ఖానా మసీదు, అలస్కా జంక్షన్‌, ఉస్మాన్‌గంజ్‌, శంకర్‌బాగ్‌, సీనా హోటల్‌, అజంతాగేట్‌ (ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌), ఆబ్కారీ లేన్‌, తాజ్‌ ఐలాండ్‌, బర్తన్‌ బజార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, కేఏకే బిల్డింగ్‌.
సెంట్రల్‌: చాపెల్‌రోడ్‌ ఎంట్రీ, గద్వాల్‌ సెంటర్‌ (జీపీఓ), షాలిమార్‌ థియేటర్‌, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్‌ రోడ్‌ ఎంట్రీ, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జంక్షన్‌ (దోమల్‌గూడ), కంట్రోల్‌రూం, కళాంజలి, లిబర్టీ జంక్షన్‌, ఎంసీహెచ్‌ ఆఫీస్‌ వై జంక్షన్‌, బీఆర్కే భవన్‌ జంక్షన్‌ (తెలుగు తల్లి జంక్షన్‌ దగ్గర), ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, ద్వారకా హోటల్‌ జంక్షన్‌, ఖైరతాబాద్‌ జంక్షన్‌ (విశ్వేశ్వరయ్య విగ్రహం), చిల్డ్రన్స్‌ పార్క్‌, మారియట్‌ హోటల్‌ జంక్షన్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, కట్టమైసమ్మ టెంపుల్‌ (లోయర్‌ ట్యాంక్‌బండ్‌), ఇందిరాపార్కు జంక్షన్‌.
నార్త్‌: కర్బలామెదాన్‌ నుంచి నెక్లెసరోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై వాహనాల అనుమతి ఉండదు. మళ్లింపులు బుద్ధభవన్‌, సెయిలింగ్‌క్లబ్‌, నల్లగుట్ట జంక్షన్‌, సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్‌ క్రాస్‌రోడ్స్‌, ప్యాట్నీ క్రాస్‌రోడ్స్‌, బాటా ఎక్స్‌ రోడ్స్‌, అడవయ్య క్రాస్‌రోడ్స్‌, ఘాంస్‌మండి క్రాస్‌రోడ్స్‌.
ప్రధాన రూట్లు
బాలాపూర్‌ గణేశ్‌ మండపం నుంచి కేశవగిరి, అలియాబాద్‌, నాగులచింత, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ, అంబేడ్కర్‌ విగ్రహం, అప్పర్‌ట్యాంక్‌బండ్‌/ఎన్‌టీఆర్‌ మార్గ్‌ వరకు ప్రధాన శోభాయాత్ర ఉంటుంది.
సికింద్రాబాద్‌ నుంచి ఆర్‌పీరోడ్‌, ఎంజీరోడ్‌, కర్బలామైదాన్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ల మీదుగా వచ్చే ర్యాలీ లిబర్టీ వద్ద ప్రధాన ర్యాలీ తో కలుస్తుంది. చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌ నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ ఆస్పత్రి మీదుగా ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్‌ వద్ద ప్రధాన ర్యాలీకి కలుస్తాయి.
ఉప్పల్‌, రామంతాపూర్‌, ఛే నెంబర్‌ జంక్షన్‌, అంబర్‌పేట్‌, శివంరోడ్‌, ఎన్‌సీసీ (ఓయూ), దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రి, హిందీ మహావిద్యాలయ క్రాస్‌రోడ్స్‌, ఫీవర్‌ ఆస్పత్రి, బర్కత్‌పురా క్రాస్‌రోడ్స్‌, నారాయణగూడ క్రాస్‌రోడ్స్‌ నుంచి వచ్చే ర్యాలీ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి వచ్చే ర్యాలీతో కలుస్తుంది.
ఐఎససదన్‌, సైదాబాద్‌, చంచల్‌గూడల వైపు నుంచి వచ్చే విగ్రహాలు నల్గొండ క్రాస్‌రోడ్‌ వద్ద దిల్‌సుక్‌నగర్‌ నుంచి వచ్చే ప్రధాన ర్యాలీలో కలుస్తాయి. మూసారాంబాగ్‌, అంబర్‌పేట్‌లవైపు వెళ్లే భారీ విగ్రహాలతో పాటు తార్నాక వైపు నుంచి ఓయూ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌రోడ్‌, అడిక్‌మెట్‌, విద్యానగర్‌ల మీదుగా వచ్చే విగ్రహాలు ఫీవర్‌ ఆస్పత్రి వద్ద కలుసుకుంటాయి.
టోలిచౌకీ, రేతిబౌలి, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలు మాసాబ్‌ట్యాంక్‌, అయోధ్య జంక్షన్‌, నిరంకారి భవన్‌, ఇక్బాల్‌మినార్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌ వైపు వెళతాయి. ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, వీవీ విగ్రహంల వైపు నుంచి వచ్చే విగ్రహాలు నిరంకారి వద్ద మెహదీపట్నం నుంచి వచ్చే ర్యాలీతో కలుస్తాయి.
టప్పచబుత్ర, ఆసిఫనగర్‌, సీతారాంబాగ్‌, బోయిగూడ కమాన్‌, వాల్గాహోటల్‌, గోషామహల్‌ బారాదరి, అలస్కాల వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఎంజే మార్కెట్‌ వద్ద ప్రధాన ర్యాలీతో కలుస్తాయి.
పార్కింగ్‌ ప్రదేశాలు

  • 1. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, ఖైరతాబాద్‌ జంక్షన్‌
  • 2. ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, ఖైరతాబాద్‌
  • 3. ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం వరకు..
  • .4. బుద్ధభవన్‌ వెనక వైపు
  • 5. గోసేవా సదన్‌
  • 6. లోయర్‌ ట్యాంక్‌బండ్‌
  • 7. కట్టమైసమ్మ టెంపుల్‌
  • 8. ఎన్‌టీఆర్‌ స్టేడియం
  • 9. నిజాం కాలేజ్‌
  • 10. పబ్లిక్‌ గార్డెన్స్‌

బస్సులు.. భారీ వాహనాలకూ..
మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులను మాసాబ్‌ట్యాంక్‌ వద్ద, కూకట్‌పల్లి వైపు నుంచి వచ్చే వాటిని వీవీ విగ్రహం వద్ద, సికింద్రాబాద్‌ బస్సులను చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌ వద్ద, ఉప్పల్‌ వైపు నుంచి వచ్చే బస్సులను రామంతాపూర్‌ టీవీ స్టేషన్‌ వద్ద, దిల్‌సుక్‌నగర్‌ నుంచి వచ్చే బస్సులను గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్‌ల వద్ద, రాజేంద్రనగర్‌ వైపు నుంచి వచ్చే బస్సులను దానమ్మ గుడిసెల వద్ద, మిధాని బస్సులను ఐఎససదన్‌ వద్ద, ఇంటర్‌సిటీ ప్రత్యేక బస్సులను వైఎంసీఏ, నారాయణగూడ వద్ద, తార్నాక నుంచి వచ్చే బస్సులను జామై ఉస్మానియా వరకే అనుమతిస్తారు.
˜ జిల్లాల నుంచి ఎంజీబీఎసకు వెళ్లే బస్సులకు కూడా అధికారులు ప్రత్యామ్నాయ దారులు చూపారు. రాజీవ్‌రహదారి, ఎన్‌హెచ్‌-7 నుంచి వచ్చే వాహనాలు జేబీఎస్‌, వైఎంసీఏ, సంగీత్‌ క్రాస్‌రోడ్స్‌, తార్నాక, జామై ఉస్మానియా ఫ్లైఓవర్‌, నింబోలిఅడ్డా, చాదర్‌ఘాట్‌ల మీదుగా అనుమతిస్తారు. బెంగళూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఆరాంఘర్‌ క్రాస్‌రోడ్స్‌, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్‌, ఐఎససదన్‌, నల్గొండ క్రాస్‌రోడ్స్‌, చాదర్‌ఘాట్‌ల మీదుగా, ముంబై ఎన్‌హెచ్‌-9 నుంచి వచ్చే వాహనాలను గోద్రెజ్‌ వై జంక్షన్‌, నర్సాపూర్‌ క్రాస్‌రోడ్స్‌, బోయిన్‌పల్లి, జేబీఎస్‌, సంగీత్‌, తార్నాక, జామైఉస్మానియా, అడిక్‌మెట్‌, నింబోలిఅడ్డా, చాదర్‌ఘాట్‌ల మీదుగా ఎంజీబీఎసకు అనుమతిస్తారు. ప్రైవేటు బస్సులకు ఆ రోజు నగరంలో ప్రవేశముండదు.
లారీలు తిరిగి వెళ్లడానికి..
నిమజ్జనం తర్వాత ఆయా లారీలు తిరిగి వెళ్లడానికి ట్రాఫిక్‌ పోలీసులు మార్గాలను సూచించారు. ఎన్‌టీఆర్‌ మార్గ్‌ వద్ద నుంచి వెళ్లే ఖాళీ లారీలు, ట్రక్కులు నెక్లెస్‌ రోటరీ, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, వీవీ విగ్రహం, కేసీపీల మీదుగా వెళ్లాలి. ఆయా వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, మింట్‌ కాంపౌండ్‌ వైపు అనుమతించరు. అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి వచ్చే లారీలు, ట్రక్కులను చిల్డ్రన్స్‌ పార్క్‌, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌ల మీదుగా పంపిస్తారు.