పార్టీ మాదే..పదవులూ మావే

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తమదేనని, అందులో ఉన్న పదవులు కూడా తమకే వస్తాయని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. తాజాగా మీడియాలో వచ్చిన వార్తలపై తనను కేటీఆర్‌ అడిగారని విలేకర్లతో చెప్పారు. తాను మీడియాతో ఏదో చిన్నగా చిట్‌చాట్‌ చేస్తే పెద్ద వార్తగా రాశారని చెప్పారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణ అనంతరం ఆర్టీసీ కార్పొరేషన్‌ పదవిలో రసం లేదని వ్యాఖ్యానించిన నాయిని.. ఇప్పుడు అదే ఆర్టీసీ కార్పొరేషన్‌ పదవి ఇచ్చినా రసం వాళ్లే పోస్తారని వ్యాఖ్యానించారు. తనని సీఎం పిలిస్తే వెళ్తానని మాట్లాడతానని నాయిని అన్నారు.