నేడు ప్రభుత్వ సెలవు

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరితో పాటు మేడ్చల్‌ జిల్లాకు వర్తింపు

హైదరాబాద్‌:
వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జంట నగరాలు, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలకు ఈ సెలవు వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గురువారం సెలవు ప్రకటిస్తున్నందున ఈనెల 14న (రెండో శనివారం) పనిదినంగా స్పష్టం చేసింది. నిమజ్జనం సందర్భంగా జంట నగరాలతో పాటు, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గణేశుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతితో పాటు బాలాపూర్‌ గణనాథుడి భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. దీంతో పాటు హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉన్న చాలా విగ్రహాలను రేపే నిమజ్జనం చేయనున్నారు. దీనికోసం అధికారులు హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌ చెరువు, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా గురువారం సెలవు ప్రకటించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరితో పాటు మేడ్చల్‌ జిల్లాకు సెలవు వర్తిస్తుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. గురువారం బదులుగా 14న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆనందోత్సాహాల మధ్య గురువారం జంట నగరాల్లో ప్రజలు గణేష్‌ నిమజ్జనం జరుపుకోనున్నారు. హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ నిమజ్జనం జరగనుండటంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.