అప్పటి దాడుల ఫొటోలు
సెప్టెంబర్ 11 ఉగ్రఘాతుకానికి సాక్ష్యాలు
హైదరాబాద్: 2001, సెప్టెంబర్ 11న, అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రెడ్ సెంటర్లపై ఉగ్రవాదులు విమానాలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడితో భారీ ట్విన్ టవర్స్ ధ్వంసం అయ్యాయి. అయితే ఆ విషాద ఘటనకు సంబంధించిన ఫోటోలను ఇప్పటి వరకు ఎవరూ రిలీజ్ చేయలేదు. బుధవారం తాజాగా ఆనాటి ఉగ్రఘాతుకానికి సాక్ష్యాలుగా మిగిలిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు. ఆ రోజున ఉదయం 9న ఘటనా ప్రాంతానికి మొదటగా డాక్టర్ ఎమిలీ చిన్ అనే మెడిక్ చేరుకున్నారు. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ వద్ద ఉన్న టవర్స్ విమానాల దాడిలో ధ్వంసం అవుతున్న సమయంలో ఆ మెడిక్ అక్కడే ఉన్నారు. ఆ డాక్టర్ రిలీజ్ చేసినవే ఈ ఫోటోలు. అమెరికాపై ఉగ్రవాదులు చేసిన దాడిలో సుమారు 2900 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ల వద్ద దాదాపు ఘటన జరిగిన వంద రోజుల వరకు కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ నిరంతరాయంగా పనిచేశారు