యువ ఆటగాళ్లు భేష్
బుమ్రా, విహారిలపై విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు
కింగ్‌స్టన్ (జమైకా): ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా పరిపూర? బౌలరని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. తన జట్టులో అతనుండటం అద ష్టమని వెల్లడించాడు. ‘తన స్వింగ్, పేస్, వైవిధ్యంతో బుమ్రా తికమకపెడతాడు. టీ20 స్పెషలిస్టుగా ముద్రపడ్డ ఒక ఆటగాడు వన్డేలపై ఆధిపత్యం చెలాయించి ఇప్పుడు టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక ఆటగాడు ‘ఒకే ఫార్మాట్‌కు ప్రత్యేకం’ అని ముద్రవేయడం ఎంత తప్పో అతడు నిరూపించాడు’ అని విరాట్ అన్నాడు.
‘ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ కావాలని బుమ్రా కచ్చితంగా కోరుకున్నాడు. క్రమశిక్షణ, పనితీరుతో తన జీవితాన్ని అలా మలుచుకున్నాడు. తన శిక్షణ, ఆహారంపై జాగ్రత్త వహిస్తాడు. తను చేయాలనుకున్న పనిపై పూర్తి నియంత్రణతో ఉంటాడు. బుమ్రా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ ఉండదు. అతడు మా జట్టులో ఉండటం మా అద ష్టం. అతడు జోరుమీదుంటే తొలి 5-6 ఓవర్లలోనే కొత్త బంతితో పని పూర్తిచేస్తాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లో వేసిన స్పెల్ కన్నా భయంకరమైన బౌలింగ్ ఇంతకు ముందు చూడలేదు. అతడి బౌలింగ్‌లో స్లిప్‌లో నిలబడి బ్యాట్స్‌మెన్ కోసం ఫీలవ్వక తప్పదు’ అని కోహ్లీ వెల్లడించాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. బ్యాటు, బంతితో అతనిప్పుడు అత్యుత్తమ దశలో ఉన్నాడన్నాడు. జట్టు విజయంలో పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడని వెల్లడించాడు. ఈ పర్యటనలో హనుమ విహారి అంటే ఏంటో తెలుసుకున్నామని విరాట్ తెలిపాడు. అత్యంత ఒత్తిడిలో, సవాల్ విసిరే వికెట్‌పై అతడి బ్యాటింగ్ అదుÄతేమని ప్రశసించాడు. అతడి నైపుణ్యం, ఆటతీరు అత్యున్నతంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి అజింక్య రహానె టాప్ ఆటగాడని విరాట్ తెలిపాడు. అతడు తిరిగి ఫామ్‌లోకి రావడం బాగుందన్నాడు. ఈ సిరీస్‌లో హనుమ విహారి 289 పరుగులు చేశాడు. అందులో ఓ శతకం ఉంది.