మోదీ చేతకానితనం వల్లే..

మాంద్యంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు 

ఢిల్లీ: ఆర్థికమాంద్యంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ఆర్థిక మాంద్యం ముంచేస్తోందన్నారు. ప్రధాని మోదీ చేతకానితనం వల్లే దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందన్నారు. పెద్దనోట్ల రద్దు, హడావుడిగా జీఎస్టీ అమలు కూడా ప్రభావం చూపిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో 3.5లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని మండిపడ్డారు. మోదీ కక్షసాధింపు రాజకీయాలు మానుకుని ఆర్థిక పరిపుష్టిపై ద ష్టి సారించాలని సూచించారు.దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5శాతానికి పడిపోవడం చూస్తే మాంద్యం ప్రభావం కనిపిస్తోందన్నారు………దిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5శాతానికి పడిపోవడం చూస్తే మందగమన ప్రభావం కనిపిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి మోదీ ప్రభుత్వ పనితీరే కారణమని విశ్లేషించారు. ఎదిగే అవకాశం ఉన్నా..అసమర్థ నిర్వహణ వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్నారు. ముఖ్యంగా ఉత్పాదక రంగం 0.6శాతానికి పడిపోవడం తీవ్ర విచారం కలిగిస్తోందన్నారు. నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలులో లోపాల ప్రభావం నుంచి దేశం ఇంకా బయటపడలేదనడానికి ఇవే నిదర్శనమన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని..కేవలం వాహన రంగంలోనే 3.5లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. అసంఘటిత రంగంలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. దేశీయ వినిమయం తగ్గిందని.. వినియోగ వ ద్ధి రేటు 18నెలల కనిషా’నికి పడిపోయిందని మన్మోహన్‌ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటోందన్నారు. ఆదాయం విపరీతంగా పడిపోవడంతో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజలు దుఠరే పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. చట్టబద్ధ సంస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని మన్మోహన్‌ ఆరోపించారు. ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.1.76కోట్ల నిధుల్ని బదిలీ చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. బడ్జెట్‌ ప్రకటనలు, పథకాల అమలు తీరు విదేశీ మదుపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. భౌగోళిక రాజకీయాల కారణాలతో అంతర్జాతీయంగా పెరిగిన ఎగుమతుల అవకాశాల్ని ఒడిసిపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. యువత, రైతాంగం, ఔత్సాహక పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని రంగాల వారికి ప్రభుత్వం ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం రాజకీయాల్ని పక్కనబెట్టి నిపుణుల్ని, మేధావుల్ని సంప్రదించాలన్నారు. ఆర్థిక వద్ధిని పరుగులు పెట్టించాలంటే ఇంతకంటే మెరుగైన మార్గం లేదన్నారు.