ద్వాదశాదిత్య మహా గణపతి

నగరానికే తలమానికం..ఖైరతాబాద్‌ వినాయకుడు 
  •  సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ఖైరతాబాద్‌ గణపయ్య 
  • 11 రోజులపాట దర్శనమీయనున్న గణేశుడు 
  • రూ. కోటి వ్యయంతో తయారయిన 61 ఫీట్ల విగ్రహం 
  • 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో దర్శనం 
  • ద్వాదశ ఆదిత్య మహా గణపతిగా దర్శనమీయనున్న స్వామి 
  • డ్రోన్‌ కెమెరాలతో భద్రత ఏర్పాట్లు పటిష్టం 
  • 6 వేల కిలోలు ఉండే తాపేశ్వరం లడ్డూ 
  • 250 మందితో 3 నెలలు శ్రమించి చేసిన విగ్రహం 
  • ఉగ్రవాదుల ముప్పు హెచ్చరికలతో బందోబస్తు పెంపు 
  • పొరుగు రాష్ట్రాలనుంచి విచ్చేయనున్న భక్తులు 

హైదరాబాద్‌: వినాయకచవితి అనగానే ఖైరతాబాద్‌ గణేషుడే గుర్తుకు వస్తాడు. ఈసారి కూడా ఖైరతాబాద్‌ వినాయకుడు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాడు. హైదరాబాద్‌లో ఎటు చూసినా వినాయకచవితి సందడే కనిపిస్తోంది. వినాయకచవితి అంటేనే బోలెడంత జోష్‌. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. గల్లి గల్లీలోనూ ఎక్కడ చూసినా గణపయ్య పేరే వినిపిస్తోంది. బొజ్జ గణపయ్య పూజలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వినాయకచవితి పండగ సమ్‌థింగ్‌ స్పెషల్‌. విగ్రహం ప్రతిష్టాపన దగ్గర నుంచీ నిమజ్జనం వరకూ అంతా భక్తి భావంతో ఉప్పొంగిపోతారు. ఘనంగా జరుపుకునేందుకు ఆరాటపడతారు. తమకు తోచిన విధంగా విగ్రాహాలు ప్రతిష్టించేందుకు ఆసక్తి చూపిస్తారు. రెండు, మూడు వారాల క్రితం నుంచే వినాయకచవితి ఉత్సవాల కోసం ఏర్పాట్లు మొదలెడతారు. ఈసారి కూడా గణేష్‌ పండుగ కోసం ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకున్నారు. 
హైదరాబాద్‌లో ముఖ్యంగా ఖైరతాబాద్‌ గణేష్‌ స్పెషల్‌ ఎక్ట్రాక్షన్‌. ప్రతి ఏడాది విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్‌ గణపతి ఈసారి ద్వాదశాదిత్య మహా గణపతిగా సద్ధమయ్యాడు. 11 రోజులపాటు భక్తులను ఆశీర్వదించనున్నాడు. ప్రతియేటా ప్రముఖ సిద్దాంతి గౌరిభట్ల విఠలశర్మ సూచనతో గణేశుడి విగ్రహాన్ని ఉత్సవ కమిటీ తయారు చేసింది. ఈసారి వికారనామ సంవత్సరంలో విగ్రహాలకు అధిపతి అయిన సూరీడు రూపంలో గణపతిని తయారుచేయించారు. ఈ వినాయకుడిని పూజిస్తే లోకకల్యాణం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని నమ్మకం. రూ. కోటి వ్యయంతో 61 ఫీట్ల విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 12 తలలు,24 చేతులు, 7 గుర్రాలతో సూర్యావతారంలోని స్వామివారిని అందంగా ముస్తాబు చేశారు. శిల్పి రాజేంద్రన్‌ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహానికి తుదిమెరుగులు దిద్దారు. 
తెలుగువారి మదిలో మొదటగా మెదిలేది ఖైరతాబాద్‌ వినాయకుడే. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో ఖైరతాబాద్‌ గణపతి దర్శనమిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖైరతాబాద్‌ వినాయకుడు మరో ఘనత సాధించాడు. దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా అరుదైన గుర్తింపు సాధించింది. ఈ ఏడాది 61 అడుగుల ఎత్తులో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి రూపుదిద్దుకున్నాడు. వినాయకుడి కుడి వైపున మహా విషు?వు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విషు?, మహేశ సమేత దుర్గాదేవి కొలువదీరారు. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో గణనాథుడు రూపుదిద్దుకున్నాడు. ఈ రూపంలో వినాయకుణ్ని పూజిస్తే సకాలంలో వర్షాలు పడి, అందరికీ మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. 
తొలిసారిగా 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ఏర్పాటుచేసిన ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహం ఏటా అడుగు చొప్పున పెంచుతూ 2014 నాటికి 60 అడుగులకు చేరింది. తర్వాత ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వచ్చినా ఈ ఏడాది 61 అడుగులు భారీ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహం రూకల్పనలో పశ్చిమ్‌ బెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 150 మంది నాలుగు నెలలపాటు శ్రమించారు. మొత్తం రూ.కోటి ఖర్చుచేశారు. ఈ ఏడాది విగ్రహ తయారీ అనుకున్న సమయంలోనే పూర్తయిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం రూపకల్పనకు చేసిన ఏర్పాట్లను శనివారం తొలగించనున్నారు. దాదాపు 50 టన్నులు బరువుండే మహాగణపతికి సెప్టెంబరు 2న వినాయక చవితి రోజున తెలంగాణ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తొలి పూజ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 
ఈ 11 రోజుల పాటు ఖైరతాబాద్‌ గణేశుని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తుల రక్షణ దష్ట్యా ఖైరతాబాద్‌ మొత్తం డ్రోన్‌ నిఘా ఉంచబోతున్నట్లు కమిటీ నిర్ణయించింది. ఖైర్‌తాబాద్‌ వినాయకుని లడ్డూకూ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉంచే భారీ లడ్డూను ఏటా తాపేశ్వరానికి చెందిన భక్తుడు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ అధినేత మల్లిబాబు లడ్డూను ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. 2015 లో ఖైరతాబాద్‌ గణేష్‌ లడ్డూ బరువు 600 కిలోలు కాగా, గతేడాది సుమారు 4500 కిలోల లడ్డును తయారు చేశారు. ఈ సంవత్సరం కూడా దీని కన్న ఎక్కువ బరువు గల లడ్డును సుమారు 6000 కిలోల బరువుతో తయారు చేస్తున్నారు. 
వినాయక చవితి అనగానే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకువచ్చేది ఎవరు? ఖచ్చితంగా ఖైరతాబాద్‌ వినాయకుడే. ఎందుకంటే దేశంలో అంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఇంకెక్కడా పెట్టరు. అందులోనూ ఖైరతాబాద్‌ గణేశ్‌ చాలా పవర్‌ ఫుల్‌. అక్కడికివెళ్లి ఏమైనా కోరుకుంటే కచ్చితంగా వారి కోరికలన్నీ నెరవేరుతాయని ప్రజల నమ్మకం. అందుకే ఖైరతాబాద్‌ వినాయకుడికి అంత పేరు. అయితే ఖైరతాబాద్‌ వినాయకుడిని ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంలో ప్రతిషి’స్తారు. ఈసారి ద్వాదశ ఆదిత్య మహా గణపతి రూపంలో ఖైరతాబాద్‌ గణేశ్‌ దర్శనం ఇవ్వబోతున్నాడు. ద్వాదశ ఆదిత్య మహా గణపతి అంటే.. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో మొత్తం 61 అడుగుల ఎత్తులో ఈసారి గణేశ్‌ ను తయారు చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ లడ్డు కూడా భారీగా ఉంటుంది. ఎంత భారీ అంటే ఆ లడ్డు గురించి సంవత్సరం మొత్తం మాట్లాడుకునే అంత భారీగా ఉంటుంది. ఈ సంవత్సరం లడ్డు బరువు సుమారు 6వేల కిలోలు ఉంటుంది. 
అంతేకాదు ఈ సారి భక్తుల రక్షణ కోసం ఖైరతాబాద్‌ మొత్తం డ్రోన్‌ కెమెరాలు ఉంచబోతున్నట్లు కమిటీ నిర్ణయించింది. ఎందుకంటే ఈ సారి వినాయకుడి ఎత్తు 61 అడుగులకు చేరుకుంది. ఒక వైపు సిద్ధ కుంజికా దేవి విగ్రహం ఉంటుంది. మరోవైపు త్రిమూర్తుల స్వరూపుడైన దత్తాత్రేయుడు కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహం తయారుచేయడానికి ముడు నెలల సమయం పట్టింది. ఇందుకు 250 మంది రాత్రి, పగలు కష్టపడి తయారు చేసారు. ఖైరతాబాద్‌లో 12రోజులు జరిగే వినాయక చవితి ఉత్సవాల భద్రత విషయానికి వస్తే… తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ ప్రకారం ఉగ్రవాదుల నుంచి వినాయకుని నిమజ్జనం రోజున ముప్పు ఉన్న కారణంగా టెక్నాలజీ పరంగా కూడా డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక గత సంవత్సరం గణేశ్‌ విగ్రహం నిమజ్జనం కావడానికి చాలా సమయం పట్టింది. ఈ సారి ప్రత్యేకంగా మలేషియా నుంచి వచ్చిన డ్రోన్‌ బందం హుస్సేన్‌ సాగర్‌లో 61 అడుగుల విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేయాలి అనేది జీహెచ్‌ఎంసీ అధికారులు, కమిటీ ప్రతినిధులు కలిసి నిర్ణయించనున్నారు. 
వినాయకచవితి వస్తోందంటే అందరి కళ్ళు ఖైరతాబాద్‌ వైపు చూస్తాయి. అక్కడ కొలువయ్యే భారీగణపయ్య ఈసారి ఎలా వుంటాడో అని అంతా వేయికళ్ళతో ఎదురుచూస్తుంటారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్‌ గణపతి ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాడు. ఖైరతాబాద్‌ గణపతి ఈ ఏడాది ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. 61 అడుగుల ఎత్తయిన వినాయకుడు భక్తులకు కనువిందు చేయనున్నాడు. 
భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్‌ గణపతికి హైదరాబాద్‌లోనే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది రూపొందించనున్న వినాయకుడి రూపం విశిష్టత గురించి చిన్నస్వామి ఆర్టిస్ట్‌ రాజేంద్రన్‌ ప్రత్యేకంగా వివరించారు. 
ఖైరతాబాద్‌ వినాయకుడు 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి రూపుదిద్దుకుంటున్నాడన్నారు. ఈ రూపంలో వినాయకుణ్ని కొలిస్తే సకాలంలో వర్షాలు పడటంతోపాటు, అందరికీ మంచి చేకూరుతుందని రాజేంద్రన్‌ అంటున్నారు. వినాయకుడికి పక్కనే ఒకవైపు సిద్ద కుంజికా దేవి ఉండనుంది. ఈమె మహాకాళి, మహా సరస్వతి, మహా లక్ష్మీ స్వరూపం. మరోవైపు త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయుడు కొలువుదీరనున్నాడు. మహాగణపతికి ఓవైపు విషు?మూర్తి, ఏకాదశి దేవి కొలువై ఉండనుండగా.. మరోవైపు త్రిమూర్తులు, దుర్గాదేవి కొలువై ఉండనున్నారు. 11 రోజుల పాటు పూజలందుకునే ఈ మహాగణపతి మహా ఉరేగింపు అనంతరం వినాయకసాగర్‌ లో నిమజ్జనం కానున్నాడు.