బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తా

గవర్నర్‌గా నియామకంపై దత్తాత్రేయ స్పందన 
హైదరాబాద్‌: రాజ్యాంగానికి లోబడి గవర్నర్‌గా తన బాధ్యతలను నిర్వహిస్తానని హిమాచల్‌ ప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా నియమితులైన తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన వెంటనే మీడియాతో ఆయన మాట్లాడుతూ, తనకు గవర్నర్‌ పదవి అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు కతజ్ఞతలని అన్నారు. గవర్నర్‌గా తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని, రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరిస్తానని చెప్పారు.