వారి కళ్లు ఎర్రబడుతున్నాయి
రైతుల పొలాలు పచ్చగా ఉంటే కాంగ్రెస్ సహించలేకపోతోంది: కేటీఆర్
- నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్‌దే
- 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- అందరికీ 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే
- కేసీఆర్ ముందుచూపుతో ప్రాజెక్టుల నిర్మాణం
- కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేకనే వలసలు
- 20 సంవత్సరాల పనులను 5 సంవత్సరాల్లో చేసిన సీఎం
- 50 లక్షల మందికి 2 వేల 116 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం
- హైదరాబాద్ కి అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి
- పేదలకు త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
- టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభలో ప్రసంగించిన కేటీఆర్
”రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారికి బుద్ధి రాలేదు. 50 లక్షల మందికి పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో పింఛన్లకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తోంది.. కానీ, ఏటా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు వెచ్చిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేక ఎక్కడికక్కడ ఇతర పార్టీల్లో చేరుతున్నారు”
-కేటీఆర్
హైదరాబాద్:
అందరికీ 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొనియాడారు.గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిగేవని, కానీ ఇప్పుడు ఆపరిస్థితి లేదని ఆయన అన్నారు. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. గతంలో నిజాంపేట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 14 రోజులకు ఓసారి నీళ్లు వచ్చేవని, ఇప్పుడు రెండ్రోజులకోసారి నీళ్లిస్తున్నామని గుర్తు చేశారు. తెరాస సభ్యత్వ నమోదు విజయోత్సవ సభను కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయని, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారికి బుద్ధి రాలేదని విమర్శించారు. 50 లక్షల మందికి పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పింఛన్లకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తోందని, కానీ, ఏటా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు వెచ్చిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేక ఎక్కడికక్కడ ఇతర పార్టీల్లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు.
పేదల పట్ల తాపత్రయం ఉన్న తెరాస నాయకులను ఎవరూ ఏమీ చేయలేరని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పారు. చెన్నైలో తాగునీటి కొరత వస్తే రైళ్లలో నీళ్లు తరలించాల్సిన పరిస్థితి వచ్చిందని, హైదరాబాద్‌కు అలాంటి కష్టం రాకుండా కష్ణా, గోదావరి జలాలను ఒడిసిపట్టేలా కేసీఆర్ ముందుచూపుతో ప్రాజెక్టులు కడుతున్నారని కేటీఆర్ కొనియాడారు. గతంలో గణేశ్ పండుగ వస్తే కర్ఫ్యూ విధించేవాళ్లని, ఇప్పుడు శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడం కొంతమందికి నచ్చడం లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ లో జరుగుతున్న అభివ ద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయని విమర్శించారు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన సభ్యత్వ నమోదు విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రైతుల పొలాలు పచ్చబడుతుంటే కాంగ్రెస్ నేతల కళ్ళు ఎర్రబడుతున్నాయన్నారు. 329 బూత్ కమిటీలు, బస్తీ కమిటీ లు వేసి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ హైదరాబాద్ లో మొదటి స్థానం లో నిలిచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశం తెలంగాణ వైపు చూసేలా అభివ ద్ధి చేస్తూ, అవినీతి లేని పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. ఇతర పార్టీల నేతలు 20 సంవత్సరాలలో చేసే పనులను 5 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రాన్ని ఏ విధంగా నడుపుతారనే సందేహం చాలా మందికి ఉండేదని, కానీ కెసిఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎండాకాలం వచ్చిందంటే బిందెలతో జలమండలి ముందు కూర్చునే వారని, ఇపుడు ఆ సమస్య లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ లో రోజు తప్పి రోజు నీళ్లు వస్తున్నాయంటే అది కేసీఆర్ ఘనతేనన్నారు. వినాయక చవితి వస్తే హైదరాబాద్‌లో గతంలో కర్ఫ్యూ విధించేవారని విమర్శించారు. హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టు తో పాటు, యువతకు కొలువులు ఇచ్చే కార్యక్రమాలను చేస్తూ ముందుకి వెళుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తుమ్మిడి హట్టి లో నాటు పడవ ఎక్కి నాటు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేతలు మారటం లేదని విమర్శించారు.
తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీ లలో చేరుతున్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల నాయకుల మాటలను పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు టిఆర్‌ఎస్ పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 లక్షల మందికి 2 వేల 116 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, దివ్యా%శీ%గులకు 3 వేల 116 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సంక్షేమ పథకాలకు కేంద్రం ఇస్తున్న మొత్తం నామమాత్రమేనన్నారు. హైదరాబాద్ లో 10 లక్షల సి సి కెమెరా లు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ కి అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని తెలిపారు. పేదలకు త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని అన్నారు. హైదరాబాద్ ప్రజలను సంత ప్తి పరిచి ఋణం తీర్చుకుంటామని తెలిపారు. ప్రత్యర్ధులు ఎక్కడ మాట్లాడినా తిప్పి కొడుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదు. దేశంలో పార్టీ పరిస్థితి ఏంటో కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేక ఎక్కడికక్కడ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉంటే కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదు. ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్ అవే ఆరోపణలు చేస్తోంది. పేదల పట్ల తాపత్రయం ఉన్న టీఆర్‌ఎస్ నాయకులను ఎవరూ ఏమీ చేయలేరు.
దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశమే అబ్బురపడే విధంగా రాష్ట్రంలో అభివ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కారుచీకట్ల నుంచి 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. అందరికీ 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఏటా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు వెచ్చిస్తోంది. హైదరాబాద్‌లో శాంతి, భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. గతంలో గణేష్ పండుగ వస్తే కర్ఫ్యూ విధించేవాళ్లు. ఇప్పుడు కర్ఫ్యూలు లేకుండా శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిగేవి. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. గతంలో నిజాంపేట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు నిజాంపేట, కుత్బుల్లాపూర్‌లో రెండు రో