తెలంగాణకే మణిహారం ఆస్ట్రా

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి 

హైదరాబాద్‌: భారత్‌, ఇజ్రాయెల్‌ భాగస్వామ్యంతో ఆస్ట్రా రాఫెల్‌ కమ్యూనికేషన్‌ సిస్టం(ఏఆర్సీ)ని రావిర్యాలలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియాకు అనుగుణంగా దేశ రక్షణ కోసం అత్యాధునిక, వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారని చెప్పారు. ఈ పరిశ్రమ తెలంగాణకు మణిహారం అని పేర్కొన్నారు. ఏఆర్సీ భారతదేశ రక్షణ అవసరాలు, ఎగుమతులపై ద ష్టి పెడుతుందన్నారు. ఏఆర్సీ భారత సాయుధ దళాలకు అవసరమైన మెటీరియల్‌ను అందిస్తుందని చెప్పారు. దీని ద్వారా ఇక్కడ యువతకు కూడా ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. ఇలాంటి మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉపాధి పెంచేందుకు తమ ప్రభుత్వం క షి చేస్తోందని పెట్టుబడులు ఆకర్షించి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని కిషన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.