పంచాయతీ కార్మికులకు సేఫ్టీ లేదు

  •  మాస్కులు, గ్లౌజులు అందించని పంచాయతీలు 
  • మురికి కాలువలు శుభ్రం చేయాలి 
  • పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి 
  • కార్మికులకు చాలీచాలని జీతాలు 
  • కార్మికుల జీతాలు ప్రభుత్వం పెంచాలి… 

రామడుగు – జ్యోతి న్యూస్‌ 

మురికి కాల్వలను శుభ్రం చేయాలి ప్రత్యేక శ్రద్ధ వహించాలి, అని చెప్పే అధికారులు పారిశుద్ధ్య కార్మికుల సేఫ్టీ మాత్రం గాలికి వదిలేస్తున్నారు, గ్రామాలలో పరిశుభ్రతతో కీలక పాత్ర పోషించే వీరిని పట్టించుకోవడం లేదు. అయినా విధినిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్న కార్మికుల పనుల్లో వెనకడుగు వేయడం లేదు.. పారిశుద్ధ్య కార్మికుల రక్షణ పై అధికారులు పట్టించుకోవడం లేదని వర్షాకాలంలో ఎక్కువగా పరికరాలు వాన నీటితో కుళ్ళిన చెత్తను తొలగించాల్సి ఉంటుంది. పనులు చేసే సమయంలో చేతులకు గ్లౌజులు, వాసన రాకుండా మాస్కులు, కాళ్లకు షూ వేసుకోవాల్సి ఉంది. ఎలాంటి రక్షణ లేకుండా కార్మికులు పనులు చేస్తే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. మండలంలో పంచాయతీ లో పనిచేసే కార్మికులకు రక్షణ కిట్లను అందించిన దాఖలాలు లేవు. గత సంవత్సరం గ్రామ పంచాయతీ సిబ్బంది కారో బార్లు, పంపు ఆపరేటర్స్‌, పారిశుద్ధ కార్మికులు, వీధి 
దీపాల నిర్వాహకులు, 45 రోజులు సమ్మె చేసిన ఎడల ప్రభుత్వము ప్రతి ఒక్కరికి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు హామీని నెరవేర్చలేదని పంచాయతీ సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పారిశుద్ధ కార్మికులు, పంప్‌ ఆపరేటర్‌, వీధి దీపాల నిర్వాహకులు, కారో బార్లు, గ్రామాలలో ఎప్పుడు వీధుల్లోఉంటారు. వీరికి చాలీచాలని జీతంతో పని చేస్తున్నారు. సిబ్బందికి ప్రభుత్వము జీతాలు పెంచాలని కార్మికుల కోరారు. 
కార్మికుల జీతాలు పెంచాలి 
నేను గ్రామపంచాయతీలో 1995 సంవత్సరం నుండి పంప్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. నాకు సరైన జీతంలేక చాలిచాలని జీతంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ ము కార్మికులను గుర్తించి ప్రభుత్వం ద్వారా జీతాలు వచ్చే విధంగా చూడాలని ,సరైన న్యాయం ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. 
-దొమకొండ దుర్గయ్య, పంపు ఆపరేటర్‌ 
గ్రామ పంచాయతీ వెదిర