జీఎస్టీని సులభతరం చేస్తాం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సంపద సష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె దిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. సంస్కరణలు అనేవి నిరంతరం జరుగుతాయని.. 2014 నుంచి సంస్కరణలు అజెండాగా పనిచేస్తున్నామని అన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో వాణిజ్య సంస్కరణల్ని తీసుకొచ్చామని వెల్లడించారు. పన్ను విధానాల్లోనూ సంస్కరణలు తెచ్చామని గుర్తు చేశారు. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు. భారత్ త్వరితంగా వద్ధి రేటు నమోదు చేస్తోందన్నారు.
25న జీఎస్టీ అధికారులతో సమావేశం
”ఎల్లుండి జీఎస్టీ అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. జీఎస్టీని మరింత సులభతరం చేస్తాం. భద్రతను బలోపేతం చేసే విధానాలు దసరా నుంచి ప్రారంభమవుతాయి. పన్నుల వసూళ్లలో ఎవరికీ ఇబ్బందులు ఉండవు. వాణిజ్య యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపైనా ఉంది ప్రపంచ జీడీపీ 3.2శాతం నుంచి మరింత పతనమవుతోంది. 2014 నుంచి మేం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ సురక్షిత స్థితి ఉంది. 2014 నుంచి సంస్కరణలే అజెండాగా పనిచేస్తున్నాం”
ఎంఎస్‌ఎంఈలను బలోపేతమే లక్ష్యం
”ఆర్థిక అవకతవకలకు అధిక జరిమానాల రూపంలో శిక్ష ఉంటుంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ప్రాసిక్యూట్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాదు. ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. సీఎస్‌ఆర్ ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల కింద పరిగణించబోం.
అక్టోబర్ 1నుంచి కేంద్రీకత విధానంలో ఐటీ నోటీసులు
”అక్టోబర్ 1 నుంచి కేంద్రీక త విధానంలో ఆదాయ పన్ను నోటీసులు ఇస్తాం. అసెసీలకు అనుగుణంగానే పన్నుల విభాగం పనిచేస్తుంది. డీఐఎన్ లేకుండా ఎలాంటి నోటీసులూ ఉండవు. నోటీసులు అందిన మూడు నెలల్లోనే అన్ని కేసులు పరిష్కారమవుతాయి. డీఎన్‌ఐ లేని నోటీసులకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏ అధికారీ సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరని తెలిపారు.
వడ్డీ రేట్ల తగ్గింపునకు కషి
”రెపో రేట్లకు అనుగుణంగానే గహ, వాహన రుణాలపై భారం తగ్గనుందన్నారు. ఈ తగ్గింపుతో గ హ, వాహన రుణాల వాయిదాలు అనుసంధానమవుతాయని చెప్పారు. మార్కెట్‌లో రూ.5లక్షల కోట్ల ద్రవ్య లభ్యతకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దేశీయ, విదేశీ ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులపై బడ్జెట్ ముందునాటి విధానం పునరుద్ధరిస్తామన్నారు. బ్యాంకులకు రూ.70వేల కోట్లు ఆర్థిక సర్దుబాటు చేస్తాం. వడ్డీ రేట్ల తగ్గుదలకు క షిచేస్తాం. వడ్డీ రేట్ల తగ్గింపుతో బ్యాంకులు పొందే లబ్ధిదారులకు చేరేలా ఏర్పాట్లు చేస్తాం. వడ్డీ రేట్ల తగ్గింపును నేరుగా రుణ గ్రహీతలకు అందించేలా చర్యలు తీసుకుంటాం” అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులను సంతప్తి పరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యంత ధనవంతులపై విధించే సర్‌ఛార్జి నుంచి వారికి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు ఆర్థిక మందగమనం నేపథ్యంలో మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా ఎఫ్‌పీఐ విషయంలో తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవలి బడ్జెట్ ప్రసంగంలో రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి వర్తించే సర్‌ఛార్జిని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల పైన పన్ను ఆదాయం ఉన్న వారికి సర్‌ఛార్జిని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి సీతారామన్ ప్రకటించారు. ఈ పరిధిలోకి ఎఫ్‌పీఐలు కూడా రావడంతో.. బడ్జెట్ అనంతరం విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా జూన్ నుంచి ఇప్పటి వరకు 10 శాతం అంటే సుమారు 3 బిలియన్ డాలర్ల మేర షేర్లను అమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లకు ఊరట కల్పించేందుకు గత కొన్ని రోజులుగా దీనిపై పలు దఫాలుగా సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.