జియో ‘గిగా’ ఆఫర్‌!

బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ కనెక్షన్‌ను ఒకే ప్యాకేజ్‌తో ముందుకు
సెప్టెంబర్‌ 5న ‘జియో ఫరెవర్‌ యాన్యువల్‌ ప్లాన్స్‌’
  • సెప్టెంబర్‌ 5న గిగాఫైబర్‌ లాంఛ్‌…
  • 1 జీబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌
  • 15 మిలియన్‌ రిజిస్ట్రేషన్లు పూర్తి
  • 1 జీబీపీఎస్‌ స్పీడ్‌తో డేటా, ల్యాండ్‌లైన్‌ ఫోన్‌, 4కే సెటాప్‌ బాక్స్‌ ఉచితం
  • త్వరలో కొత్త క్లౌడ్‌ డేటా సెంటర్స్‌ ఏర్పాట్లు
  • మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం
  • 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో
    రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ ముకేష్‌ అంబానీ

టెలికాం రంగంలో తనదైన ప్రత్యేకత కలిగిన రిలియన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ మరో సంచలన జియో సరికొత్త ఆఫర్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ యొక్క 42వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిలయెన్స్‌ జియో మళ్లీ అద్భుతమైన ఆఫర్లతో పాటు గిగాఫైబర్‌ సేవలు ప్రారంభించడం దగ్గర్నుంచి… గిగాఫైబర్‌ ప్లాన్స్‌ తీసుకునేవారికి ఉచితంగా టీవీ అందించడం వరకు అనేక కొత్త సర్వీసుల్ని అందజేస్తున్నామని ప్రకటించింది. ఈ సర్వీసును సెప్లెంబర్‌ 5న జియో గిగాఫైబర్‌ లాంఛ్‌తో మళ్లీ మీ ముందుకు వస్తునామన్నారు. మరో 12 నెలల్లో జియో గిగాఫైబర్‌ సేవల్ని అందిస్తామని తెలిపారు.
ఈ వార్షిక స్వరసభ్య సమావేశంలోని ముఖ్యాంశాలు

1. బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న గిగాఫైబర్‌ సేవలపై స్పష్టత ఇచ్చింది రిలయెన్స్‌ జియో. సెప్టెంబర్‌ 5న జియో గిగాఫైబర్‌ సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. మరో 12 నెలల్లో జియో గిగాఫైబర్‌ సేవల్ని అందిస్తామని రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ ముకేష్‌ అంబానీ ప్రకటించారు.

2. రిలయెన్స్‌ నుంచి జియో టెలికామ్‌ సేవలు ఓ సంచలనమైతే… బ్రాడ్‌బ్యాండ్‌ సెక్టార్‌లో గిగాఫైబర్‌ సర్వీస్‌ మరో సంచలనం కానుంది. 2018 ఆగస్ట్‌లోనే గిగాఫైబర్‌ సర్వీస్‌ను ప్రకటించింది రిలయెన్స్‌ జియో.

3. బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ కనెక్షన్‌ను ఒకే ప్యాకేజ్‌లో అందించడమే గిగాఫైబర్‌ ప్రత్యేకత. గిగాఫైబర్‌ కోసం గతేడాదే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
4. గిగాఫైబర్‌ కోసం 1600 పట్టణాల నుంచి 15 మిలియన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు ముకేష్‌ అంబానీ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా గిగాఫైబర్‌ సేవల్ని అందిస్తోంది రిలయెన్స్‌ జియో.
5. మొత్తం 20 మిలియన్‌ ఇళ్లకు గిగాఫైబర్‌ సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది రిలయెన్స్‌.

6. రిలయెన్స్‌ జియో గిగాఫైబర్‌ కనెక్షన్‌ తీసుకున్నవారికి 1 జీబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ లభిస్తుంది. అంటే సెకన్‌కు 1 జీబీ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. దీంతో పాటు ల్యాండ్‌లైన్‌ ఫోన్‌, జియో 4కే సెట్‌ టాప్‌ బాక్స్‌ సెటాప్‌ బాక్స్‌ ఉచితంగా లభిస్తాయి.

7. గిగాఫైబర్‌ ప్లాన్స్‌ 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వరకు ఉంటాయి. రూ.700 నుంచి రూ.10,000 వరకు ప్లాన్స్‌ ధరలు ఉంటాయి.

8. ఇక గిగాఫైబర్‌ యాన్యువల్‌ ప్లాన్‌ తీసుకున్నవారికి హెచ్‌డీ 4కే ఎల్‌ఈడీ టీవీతో పాటు సెట్‌ టాప్‌ బాక్స్‌ ఉచితంగా ఇవ్వనున్నట్టు రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ ముకేష్‌ అంబానీ ప్రకటించారు.

9. ‘జియో ఫరెవర్‌ యాన్యువల్‌ ప్లాన్స్‌’ పేరుతో ఈ ఆఫర్‌ ప్రకటించారు. యాన్యువల్‌ ప్లాన్‌ తీసుకుంటే కేవలం ప్లాన్‌ ఛార్జీలు చెల్లిస్తే చాలు. హెచ్‌డీ 4కే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌ టాప్‌ బాక్స్‌ ఉచితంగా పొందొచ్చు.

10. ఇక ‘జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ పేరుతో ఓ ప్లాన్‌ ప్రకటించింది రిలయెన్స్‌ జియో. జియో గిగాఫైబర్‌ ప్రీమియం కస్టమర్లు… ఏ సినిమా ఎప్పుడు రిలీజైనా మీరు ఇంట్లోనే చూడొచ్చు. కేవలం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.

11. ‘జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సేవలు వచ్చే ఏడాదిలో ప్రారంభమౌతాయని రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సీఎండీ ముకేష్‌ అంబానీ తెలిపారు.

12. గిగాఫైబర్‌ తీసుకున్నవారికి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ డేటా, సెట్‌ టాప్‌ బాక్స్‌, ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌తో పాటు అల్ట్రా హై డెఫినేషన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్‌, హోమ్‌ సెక్యూరిటీ, స్మార్ట్‌ హోమ్‌ సొల్యూషన్స్‌ సేవలు లభించనున్నాయి.

13. ఇక కొత్త క్లౌడ్‌ డేటా సెంటర్స్‌ ఏర్పాటు, మరిన్ని సంస్థలు టూల్స్‌ యాక్సెస్‌ చేయడం కోసం రిలయెన్స్‌ జియో, మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

14. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా డేటా సెంటర్లను ఏర్పాటు చేయడంలో రిలయెన్స్‌ జియో కలిసి నడవనుంది. మైక్రోసాఫ్ట్‌ సాయంతో దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో అతిపెద్ద వాల్డ్‌ క్లాస్‌ డేటా సెంటర్లను రిలయెన్స్‌ ఏర్పాటు చేయనుంది.