ప్రశ్నించే పరిస్థితి లేకుంటే

ప్రజాస్వామ్యానికే ప్రమాదం 
మత రాజకీయాలపై కేటీఆర్‌ ఆవేదన 
  • జాతిపితను గౌరవించుకోలేని పరిస్థితికి దేశం దిగజారిపోయింది 
  • -ప్రభుత్వాలు అతిగా మతానికి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు
  •  -తెలంగాణలో ప్రజలకు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది 
  • -మహాత్ముడినే అవమానించిన ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ 
  • -ఎంపీ వ్యాఖ్యలను ఖండించని బీజేపీ నేతలు
  •  -తనతో ఉంటే దేశభక్తుడు.. నీతో ఉంటే దేశద్రోహి 
  • -సెక్యులరిజం అంటే మతాలను పరస్పరం గౌరవించుకోవడం 
  • -ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ వికాస సమితి ఏర్పడింది 

హైదరాబాద్‌: 
దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని.. తర్కించి విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. శనివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మత రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఒక మతాన్ని వ్యతిరేకించడం లేదా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. జాతిపితను గౌరవించుకోలేని పరిస్థితికి దేశం దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. 
తెలంగాణలో తరతరాలుగా మత భేదం లేకుండా జీవనం కొనసాగుతోందన్నారు. ‘నాతో ఉంటే దేశ భక్తుడివి లేకపోతే దేశ ద్రోహివి’ అన్న పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ వికాస సమితి ఏర్పడిందని కేటీఆర్‌ తెలిపారు. నాథురామ్‌ గాడ్సే దేశభక్తుడంటూ సాద్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యల్ని తాను సోషల్‌ మీడియాలో ఖండించినట్టు ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ తనకు ట్విటర్‌లో కామెంట్‌ రావడం ఎంతో బాధ కలిగిందని కేటీఆర్‌ చెప్పారు. 
ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలకు ఏదైనా మాట్లాడే.. చర్చించే స్వేచ్ఛ ఉందన్నారు. ప్రజల విశ్వాసాలు, అభిప్రాయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, తనతో ఉంటే దేశభక్తుడు.. నీతో ఉంటే దేశద్రోహి అనే పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. మతానికి భాష ఉండొచ్చు కానీ భాషకు మతం ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పరమత సహనం, అందర్నీ గౌరవించే సంప్రదాయం ఉందని కేటీఆర్‌ చెప్పారు. మత వైరుధ్యాలకు విలువలేని పరిస్థితి దేశంలో ఉందని, మహాత్ముడినే అవమానించిన ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలను బీజేపీ సమర్థించడం బాధాకరమని కేటీఆర్‌ చెప్పారు. 
నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి మూడో రాష్ట్ర మహాసభ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరై ప్రసంగించారు. తెలంగాణ వికాస సమితి భిన్నాభిప్రాయాలను పంచుకునే వేదిక అని తెలిపారు. భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హైదరాబాద్‌లో స్వేచ్ఛ ఉందన్నారు. పాలనలో ఏమైనా తప్పులున్నా ఎత్తి చూపే స్వేచ్ఛ వికాస సమితికి ఉంది. భాషకు మతం ఉండదని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఎప్పుడూ చెబుతుండేవారు. ముస్లింల కంటే అనర్గళంగా ఉర్దూ మాట్లాడే ఇతరులు చాలా మంది ఉన్నారు. లౌకికవాద దేశమంటే మతాన్ని రద్దు చేయడం కాదు. ఒక మతాన్ని వ్యతిరేకించడం, లేదా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను పరస్పరం గౌరవించుకోవడం. మతం, రాజకీయం విడదీయలేనంత ప్రమాదకరంగా పెనవేసుకుపోతోంది. అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిది. మతోన్మాదం పెచ్చరిల్లితే భవిష్యత్‌ తరాల పరిస్థితి ఆందోళనకరం. గాడ్సే గొప్ప దేశభక్తుడని సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యను తాను ఖండిస్తే సోషల్‌ మీడియాలో దారుణమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం దేశంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. తర్కించి, విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. తనతో ఉంటే దేశభక్తుడిని.. లేకపోతే దేశద్రోహిని అనే పరిస్థితులు ఉన్నాయి. ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ వికాస సమితి ఏర్పడింది. తెలంగాణలో మతభేదం లేకుండా జీవనం కొనసాగుతోంది అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 2014, జులై 4వ తేదీన దొడ్డి కొమురయ్య వర్ధంతి రోజున వికాస సమితి ఆవిర్భవించింది. 
2018 సంవత్సరానికిగాను 66వ జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్రాలు సత్తాచాటిన విషయం తెలిసిందే. అలనాటి నటనాభినేత్రి సావిత్రి జీవిత కథతో రూపొందించిన మహానటి మూడు అవార్డులను గెలుచుకొని అగ్రభాగాన నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు..సినిమాలో అద్భుతాభినయాన్ని ప్రదర్శించిన కీర్తి సురేష్‌ జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్స్‌ విభాగంలో కూడా మహానటి పురస్కారాన్ని సాధించింది. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన రంగస్థలం ఉత్తమ ఆడియోగ్రఫీ, రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన చి?ల?సౌ ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో అవార్డులను సాధించాయి. అ! చిత్రం మేకప్‌, వీఎఫ్‌ఎక్స్‌ విభాగాల్లో పురస్కారాల్ని సాధించింది. 

ఈ సందర్భంగా విజేతలని చిరంజీవి, రాజమౌళి, పవన్‌ కళ్యాణ్‌తో పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. తాజాగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ట్విట్టర్‌ ద్వారా అవార్డు విన్నర్స్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిభావంతులని జ్యూరీ గుర్తిచింది. జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్‌తో పాటు మహానటి టీంకి అభినందనలు. అలానే రాహుల్‌ రవీంద్రన్‌, రంగస్థలం టీం తో పాటు నానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కేటీఆర్‌ పేర్కొన్నారు. శారద(నిమజ్జనం), అర్చన(దాసి), విజయశాంతి(కర్తవ్యం) తర్వాత తెలుగు సినిమా నాయిక సావిత్రి పాత్రధారిణి కీర్తి సురేష్‌ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని పొందడం విశేషం.