ఉల్లి చేసే మేలు

ఉల్లిపాయలు వంటకే కాదు, సౌందర్య పోషణకూ ఉపయోగపడతాయి. చర్మ రక్షణకు అవసరమైన పోషకాలు ఉల్లిలో బోలెడన్ని. కాబట్టి ఉల్లిని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం! 
నల్లని ముఖచర్మం: బ్లాక్‌ పిగ్మెంటేషన్‌ వల్ల ముఖచర్మం నల్లగా మారి, పొడిబారుతుంది. ఈ ఇబ్బంది వదలాలంటే ఉల్లి రసంలో సెనగపిండి, మీగడ కలిపి ముఖం మీద అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున నాలుగు వారాలు చేస్తే పిగ్మెంటేషన్‌ తగ్గి చర్మం తెల్లగా మారుతుంది. 
చర్మపు మెరుపు: చర్మం నిర్జీవంగా తయారైతే ఉల్లి రసాన్ని నేరుగా ముఖం మీద పూసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్‌, విటమిన్లు చర్మానికి సరిపడా పోషణను అందించి, ఆరోగ్యాన్ని సంతరించి పెడతాయి. 
దోమ, పురుగు కాట్లు: ఉల్లి రసం నొప్పి నివారిణి. కందిపోవడం, వాపును కూడా తగ్గిస్తుంది. కాబట్టి దోమ కాటుకు, పురుగు కాటుకు కందిన ప్రదేశంలో ఉల్లి రసాన్ని పూయాలి. 
ఉల్లిలో సల్ఫర్‌, పొటాషియం, సోడియం, ఫైబర్‌, విటమిన్‌ ఏ,బీ,సీ, పుష్కలంగా దొరుకుతాయి. ఉల్లిలోని అత్యంత శక్తివంతమైన క్వెర్సిటిన్‌, ఆల్లిసిన్‌ అనే పదార్థాలు క్యాన్సర్‌ను నిరోధించడంలో దోహదపడతాయి. రోజూ ఆహారంలో ఏదో ఒక రూపంలో ఉల్లిని తీసుకుంటే ప్రమాదకరమైన జబ్బుల నుంచి దూరం కావచ్చు. 
-ఉల్లిలో ఉన్న పైటో కెమికల్స్‌, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 
-క్రోమియం అనే మూలకం రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రిస్తుంది. 
-ఉల్లిలో విటమిన్‌ ఏ ఇతర ప్రీ రాడికల్స్‌ అధికంగా ఉంటాయి. 
-ఉల్లిలో ఉండే ఫాలెట్‌ రసాయనం శరీరంలో డోపమిన్‌, సెరాటోనిన్‌, హోమోసిస్లెన్‌ వంటి హోర్మోన్లను ఉత్తేజ పరుస్తుంది. తద్వారా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది. 
-చిన్న వయస్సులో మోకాళ్లు, కీళ్ల సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. 
రక్తంలో అవసరమైన కొవ్వు పదార్థలను వేరు చేసి చెడు కొవ్వును బయటకు పంపుతుంది. 
జ్ఞాపకశక్తిని పెంపొందించడంతో పాటు బలమైన నాడీవ్యవస్థ తయారయ్యేందుకు దోహదపడుతుంది. 
-అతినీలలోహిత కిరణాలతో ఎలాంటి చర్మ సమస్యలూ రాకుండా ఉల్లిలో ఉన్న విటమిన్‌ ఏ,సీ ఈ చూస్తాయి. 
-చర్మం కాలినప్పుడు, తేనేటీగలు లేదా కందిరీగలు కుట్టినప్పుడు ఉల్లి రసాన్ని గాయంపై రాస్తే త్వరగా నయమవుతుం ది. పసుపు, ఉల్లిరసాన్ని ముఖంపై అద్దితే మచ్చ లు తొలగిపోతాయి. అందుకే ఈ మిశ్రమా న్ని అన్నిరకాల ఫేస్‌ క్రీముల్లో వాడుతుంటారు. 
శరీరంలో ఉన్న కణజాలాలను ఉత్తేజ పరిచేందుకు ఉల్లి ఉపకరిస్తుంది. 
-జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో ఉల్లి కీలకపాత్ర పోషిస్తుంది. 
-తరిగిన ఉల్లి ముక్కను నుదుటిపై కొద్టిసేపు ఉంచితే జ్వరం తగ్గుముఖం పట్టడంతో పాటు చెవి, కన్ను, దంత సంబంధిత వ్యాధులు సైతం దూరమవుతాయి. 
-రాత్రిపూట ప్రశాంతమైన నిద్రకు ఉపక్రమించాలన్నా ఉల్లి అవసరమే. ఇన్‌సోమ్నియా రాకుండా ఉల్లి ఉపయోగపడుతుంది. 
-ఆముదం లేదా నువ్వుల నూనెలో ఉల్లిని వేయించి తీసుకుంటే అన్ని నొప్పుల నుంచీ ఉమశమనం లభిస్తుంది. 
-ఉల్లికాడల్లో అధికంగా ఉండే విటమిన్‌ ఏ ఇతర ఫ్రీరాడికల్స్‌ అల్సర్స్‌ రాకుండా చూస్తాయి. 
ఉల్లి గడ్డ ముక్క వాసన చూస్తే ముక్కు నుంచి జరిగే రక్తస్రావం అగిపోతుంది. 
-తాజా ఉల్లి జ్యూస్‌తో శరీరానికి మర్దనా చేస్తే రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. 
-చర్మం మదువుగా, కోమలంగా ఉండేలా చూసి చిన్న వయస్సులోనే వద్ధాప్య లక్షణాలు రాకుండా కాపాడుతుంది.