బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి సమావేశం
సిద్దిపేట -జ్యోతి న్యూస్
బక్రీద్ పండుగ పర్వదినాల సందర్భంగా వివిధ మత పెద్దలతో ఈరోజు సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో శాంతి సమావేశం నిర్వహించిన సిద్ధిపేట మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు. పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో సిద్ధిపేట మున్సిపల్ చైర్మెన్ రాజనరసు, సిద్దిపేట అడిషనల్ డిసిపి.నర్సింహరెడ్డి, ఏసిపి రామేశ్వర్ గార్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగను నిర్వహించుకోవా లని, అన్ని కులాల మతాల పండుగ పర్వదినాలను శాంతియుతంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, మత సామరస్యం గురించి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. ముఖ్యంగా మత సామరస్యానికి ప్రతీకగా సిద్దిపేట జిల్లా వుందని అన్ని మతల కులాల వారు సోదర భావంతో మెలగడం మంచి సంప్రదాయమన్నారు, బక్రీద్ పండుగ నేపథ్యంలో మూడు రోజులపాటు ఖుర్బానీ రోజులలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.
సోషల్ మీడియాలో మత ఘర్షణల ప్రేరేపిత వార్త ఏదైనా వస్తే నమ్మవద్దని తెలిపారు. వెంటనే పోలీసువారికి తెలపాలని సూచించారు. పట్టణలలో గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం ఈ నెంబర్లుకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100,ఎసిపి సిద్దిపేట్-9490617009, మరియు డయల్ 100, ఫోన్ చేసి తెలిపినాచో వెంటనే సమ్యసను పరిష్కరిస్తాం అని తెలిపారు. పుకార్లు నమ్మవద్దని తెలిపారు, మసీదు వద్ద పటిష్టమైన చర్యలు చేపడతాం అన్నారు. నమాజ్ ఈ టైంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ సీఐకి ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతు… సిద్దిపేట పట్టణంలో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పండుగలు జరుపుకోవడం సిద్దిపేట జిల్లా ప్రత్యేకత గా తెలిపారు, మజీద్‌ల వద్ద గ్రేవ్ యాడ్స్ వద్ద, ఎలాంటి నీటి కొరత గాని మరియు సానిటరీ ప్రాబ్లంగాని లేకుండా చూస్తామని, పశువుల కళేబరాలను పట్టణానికి దూరంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పండుగలు జరుపుకోవాలని కోరారు.
ఈ సందర్బంగా వివిధ మత పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడించి పోలీస్ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యకు తమ వంతు సహకాహరం అందజేయడంతో పాటు, అన్ని మతాలవారు తమ పండుగను ఇతర మతస్తులతో కల్సి నిర్వహించుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో సిద్దిపేట్ తాజుమ్. ప్రెసిడెంట్ డాక్టర్ గౌసు మోయివోద్దిన్, వైస్ ప్రెసిడెంట్ గౌస్ మొయినుద్దీన్, గుండ్ల జనార్దన్, కౌన్సిలర్ మోహిజ్, కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బాల రాజేశం, గుండ్ల జనార్ధన్, సిద్ది సాగర్, బిజెపి జిల్లా ఉప అధ్యక్షుడు, ఆర్. యస్.యస్ జిల్లా ప్రతినిధి మరియు హిందూ ముస్లిం పెద్దలు సిద్దిపేట టు టౌన్ సిఐ ఆంజనేయులు, సిద్దిపేట ట్రాఫిక్ సీఐ వన్ టౌన్ ఇంచార్జ్ శ్రీనివాస్, ఎస్‌ఐలు శ్రీనివాస్, కనకయ్య గౌడ్, హిందూ ముస్లిం సంఘ పెద్దలు పీస్ కమిటి మెంబర్లు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.