ఖాదీలో మెరిపోవాలిలా!

స్వాతంత్య్ర భావనలకు ప్రతీక ఖాదీ.స్వరాజ్య పోరాట చిహ్నం ఖాదీ.ఖాదీ అంటే అదేదో ఫ్రీడమ్‌ ఫైటర్ల బ్రాండ్‌ అనేది ఓ పాత నమ్మకం. ఇప్పుడు ఫ్రీడమ్‌ను ఇష్టపడేది యువతే.అలాంటప్పుడు యూత్‌ స్వతంత్ర పోకడలకు ఖాదీ ఓ స్టైల్‌ స్టేట్‌మెంట్‌ ఎందుకు కాకూడదు?దేశం కోసం జయహో అన్నట్టే… తమ దేహం మీద స్టైల్‌గా ఖాదీ హో అంటోందిప్పటి యువత.
ఒకప్పుడు రాజకీయనాయకులకు, వద్ధులకు మాత్రమే పరిమితమైన ఖాదీ, ఖద్దరు, చేనేత వస్త్రాలు ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఖాదీ వస్త్రం ప్రముఖ డిజైనర్లకు సిరులను కురిపిస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ కొద్దిరోజుల క్రితం మన్‌కీ బాత్‌లో ఖాదీ ఫర్‌ నేషన్‌, ఖాదీ ఫర్‌ ఫ్యాషన్‌ అని పేర్కొంటూ ఖాదీకి తానే బ్రాండ్‌ అంబాసిడర్‌నని ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఖాదీ అమ్మకాలు 32 శాతం పెరిగాయి. అయితే.. అసలైన ఖాదీని చాలా చోట్ల అమ్మటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవర్‌లూం యంత్రాలపై తయారైన వాటినే ఖాదీ పేరుతో జనానికి అంటగడుతున్నారు. ఖాదీ అంటే… చేతితో దారాన్ని ఒడికి, మగ్గంపై చేతితో నేసినది. అది కాటన్‌, సిల్క్‌, ఊల్‌.. ఏదైనా కావచ్చు అంటూ ఖాదీకి ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ నిర్వచనం చెబుతోంది. కానీ అత్యధిక దుకాణలు, షోరూముల్లో ఈ విధంగా తయారైన ఖాదీని అమ్మటం లేదు.
మోడ్రన్‌గా కనిపించాలంటే ఖాదీ చీరకు బ్లౌజ్‌గా లూజ్‌ క్రాప్‌టాప్స్‌, షర్ట్స్‌, జాకెట్‌ని ఎంపిక చేసుకోవచ్చు. సింపుల్‌ అండ్‌ మార్వలెస్‌ అనే కితాబులు పొందవచ్చు. ‘ఖాదీ చీరనా! అది బామ్మల కట్టు మనకొద్దు’ అనే మాట ఈ నయాస్టైల్‌ చూస్తే మార్చేసుకుంటారు. తమ వార్డ్రోబులో ఖాదీకి ప్రత్యేక స్థానం ఇస్తారు.
వెస్ట్రన్‌ డ్రెస్‌ల మీదకు వేసి షోల్డర్‌లెస్‌ క్రాప్స్‌ ఖాదీ చీరను అందాన్ని కూడా వినూత్నం చేసేసింది. ఆధునిక మహిళ చేత అభినందనలు అందుకుంటోంది. ఒకప్పుడంటే ముడులు వేసే రవికలు ఉండేవి. ఇప్పుడా స్టైల్‌ మారి కొత్తగా రూపుదిద్దుకుంది. కుచ్చులున్న జాకెట్‌ ముడితో ఖాదీ కట్టు మరింత కలర్‌ఫుల్‌గా మారింది.