దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి!
ముంబాయి: వన్డే ప్రపంచకప్ గెలవడం ప్రతీ జట్టుకూ ఓ మధుర జ్ఞాపకం. క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లాండ్ నాలుగు దశాబ్దాలకు పైగా ఎదురుచూసి ఇటీవలే తన కలను సాకారం చేసుకుంది. 2015 ప్రపంచకప్‌లో గ్రూప్‌దశ నుంచే ఘోరంగా నిష్క్రమించిన ఇంగ్లాండ్ 2019లో విశ్వవిజేతగా అవతరించింది. అందుకోసం నాలుగేళ్ల నుంచి కష్టపడింది. సరైన ప్రణాళికతో పాటు ఆటగాళ్లు తమ బలాబాలాలపై దష్టిసారించి వారి లోపాలను సరిచేసుకున్నారు. ఇయాన్‌మోర్గాన్ నేతత్వంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఏర్పాటు చేసుకొని మేటి జట్లను మట్టికరిపించి ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ జట్టును ప్రేరణగా తీసుకొని సఫారీల జట్టు సైతం రాబోయే ప్రపంచకప్‌లో తన కలను సాకారం చేసుకుంటుందా చూడాలి.
1992 ప్రపంచకప్‌లో తొలిసారి పాల్గొన్న దక్షిణాఫ్రికా జట్టు అండర్‌డాగ్స్‌గా అడుగుపెట్టి అందరి అంచనాలను తలకిందులు చేసింది. అనూహ్యంగా సెమీఫైనల్స్ వరకూ వెళ్లి దురద ష్టవశాత్తూ ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. వర్షం కారణంగా సెమీస్ నుంచి నిష్క్రమించిన సఫారీల జట్టు.. ఆపై జరిగిన ప్రతీ మెగా ఈవెంట్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగడం, నిరాశతో వెనుతిరుగడం పరిపాటిగా మారింది. అభిమానుల అంచనాలు అందుకోలేక కొన్నిసార్లు, వర్షం కారణంగా కొన్నిసార్లు ఆ జట్టును దురద ష్టం వెన్నాడింది. స్టార్ ఆటగాళ్లు ఎందరున్నా ప్రపంచకప్ అందుకోలేని అనుభవాలు ఆ జట్టుకు ఎప్పుడూ పీడకలలా గుర్తుండిపోతాయి.
ప్రపంచకప్‌లో సఫారీల చరిత్ర:
తొలిసారి 1992 ఐసీసీ ప్రపంచకప్‌లో పాల్గొన్న సఫారీల జట్టు గ్రూప్ దశ నుంచి సెమీస్‌కు దూసుకెళ్లి ఇంగ్లాండ్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. దక్షిణాఫ్రికా గెలుపు అంచుల్లో ఉండగా వర్షం కురవడంతో డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో సఫారీల లక్ష్యం 1 బంతికి 22 పరుగులుగా మారింది. దీంతో ఫైనల్ చేరాల్సిన ఆ జట్టు ఇంటి ముఖం పట్టింది.
1996లో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరగా విండీస్ జట్టు షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 264 పరుగులు చేసి లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాను 245 పరుగులకు కట్టడిచేసింది. ఇక 1999 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీస్‌లో ఇరు జట్లూ సమాన స్కోర్ 213 చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే సూపర్ సిక్స్ గ్రూప్ దశలో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆ జట్టు ఫైనల్స్‌కు చేరుకొంది.
2003 ప్రపంచకప్‌లో మళ్లీ వర్షం సఫారీల ఆశలపై నీళ్లు పోసింది. శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్ టైగా ముగీయడంతో పొలాక్ నేత తంలోని దక్షిణాఫ్రికా అర్ధాంతరంగా ఇంటిముఖం పట్టింది. తర్వాత 2007లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి, 2011 క్వార్టర్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై గెలవాల్సిన మ్యాచ్ పరాభవం.. 2015లో మళ్లీ న్యూజిలాండ్ చేతిలోనే వర్షం కారణంగా సెమీస్‌లో ఓడటం జరిగాయి. ఇటీవల జరిగిన 2019లో ఏకంగా గ్రూప్ దశ నుంచే ఘోరంగా నిష్క్రమించింది.
బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో మేటి ఆటగాళ్లున్నా సఫారీలకు ప్రపంచకప్ అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. 2003లో షాన్‌పొలాక్, 2015లో ఏబి డివిలియర్స్ బాధ వర్ణనాతీతం. ఈ రెండు సంఘటనలను క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సరైన ప్రణాళికతో పాటు ప్రత్యర్థుల బలాబలాలపై దష్టి సారించాలి. ఈ నాలుగేళ్లు తిరుగులేని జట్టుగా ఎదిగి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పూర్వ వైభవం సాధించాలి. అలా చేస్తే దక్షిణాఫ్రికా విశ్వవిజేతగా నిలవడం పెద్ద సమస్యేమీ కాదు.
స్టేటస్ రద్దు… ఆ తర్వాత