బందరు పోర్టును.. ఎంతకమ్మేశారు?

  • ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవోలను బహిర్గతం చేయాలి
  • పోర్ట్‌ పై సీఎం జగన్‌ ప్రకటన చేయాలి
  • బెయిల్‌పై బయట తిరిగేవాళ్లా.. మమ్మల్ని విమర్శించేది
  • విలేకరుల సమావేశంలో టీడీపీ నేత దేవినేని ఉమా

అమరావతి, ఆగస్టు1-: బందరు పోర్టును కేసీఆర్‌కు ఎంతకు విక్రయించారో ఏపీ సీఎం జగన్‌ 
చెప్పాలని, ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవోలను బహిర్గంతం చేయాలని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం అమరావతిలో కొల్లు రవీంద్రతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.. ప్రభుత్వం మారగానే బందరు పోర్టు పనులు చేసే యంత్రాలు వెనక్కిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ బెదిరింపులకి భయపడి ఆ నిర్మాణ సంస్థ వెనక్కి పోయిందని దేవినేని విమర్శించారు. బందరు పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి ఎంతకు అమ్మేశారని దేవినేని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వం క్విడ్‌ ప్రోకో సంస్థకు బందరు పోర్ట్‌ ఇచ్చేసిందని విమర్శించారు. తమపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయి రెడ్డి.. ఇటీవల జరిగిన సెర్బియా అరెస్టులపై ఎందుకు ట్వీట్‌ చేయలేదని పరోక్షంగా నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టును ప్రస్తావించారు. సెర్బియా పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? 22మంది ఎంపీలు మోదీని కలిసి ఏమి అడుక్కున్నారో ట్వీట్‌ చెయ్యి అంటూ విజయసాయిని నిలదీశారు. నీలాగా 16నెలలు జైలు కెళ్ల లేదు, డబ్బు దోచుకోలేదు, క్విడ్‌ ప్రోకోకు పాల్పడలేదని, నువ్వా నన్ను బెదిరించేది అంటూ దేవినేని విజయసాయిపై మండిపడ్డారు. నీలాగా నేను అక్రమాలకు పాల్పడలేదని, చంద్రబాబు పడిన కష్టానికి నిదర్శనం పోలవరం ప్రాజెక్టు పనులను రెండు నెలల నుంచి నిలిపేసిన పాపం విూదన్నారు. ఇటీవల ఒక సీఎం, కొంతమంది ఎంపీలు ప్రధాని కాళ్ల పై పడ్డారని, వారెవరో ట్వీట్‌ చేయాలని విజయసాయిరెడ్డి ని డిమాండ్‌ చేస్తున్నా అని దేవినేని ఉమ పేర్కొన్నారు. బెయిల్‌పై తిరుగుతున్న ఆయన తమను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బందరు పోర్ట్‌ పై సీఎం జగన్‌ ప్రటన చెయ్యాలని డిమాండ్‌ చేశారు. బందరు పోర్టుపై ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవోలను బహిర్గతం చేయాలని కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన చేయాలని దేవినేని డిమండ్‌ చేశారు. జగన్‌ నీతులు వల్లిస్తారని.. కానీ జీవోలు మాత్రం కాన్ఫడెన్షియల్‌ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి దేవినేని ఉమ మాట్లాడుతూ.. విూరు తీసుకెళ్లే గోదావరి నీరు.. రివర్స్‌ ట్రెండింగా.. ఫార్వార్డ్‌ ట్రెండింగా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌.. చేసిన సాయానికి జగన్‌ క్విడ్‌ ప్రోకో కింద బందరు పోర్ట్‌ కట్టబెట్టారని ఆరోపించారు. అందుకే రహస్య జివో ఇచ్చి.. ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఇసుక సామాన్య ప్రజలకు దొరక్కుండా చేశారని.. దీంతో నిర్మాణ పనులు నిలిచి పోయాయని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.