ఆగష్టు సంక్షోభం ఇప్పుడే!

చంద్రబాబును వెంటాడుతున్న తమ్ముళ్ల వలసలు

  • తెలుగుదేశాన్ని పట్టి పీడిస్తున్న ఆగష్టు సంక్షోభం
  • ఎన్టీఆర్‌, చంద్రబాబులకు జరిగిన గతానుభవాలు
  • ఆపరేషన్‌ కమల్‌ అంటూ ఉత్సాహంగా ఉన్న బీజేపీ
  • వైఎస్‌ఆర్‌సీపీ వైపు మరికొందరు ఎమ్మెల్యేల చూపు
  • మరో పక్క అధికారపక్షం పెట్టబోయే కేసులు
  • ఇంకో పక్క ప్రతిపక్ష హోదాలేకుండా చేసేందుకు కుట్రలు
  • శ్రావణ మాసం పార్టీ మారేందుకు శుభయోగం
  • ఇప్పటికే ముఖ్యనేతలతో టచ్‌లో ఉన్న కమలనాధులు
  • కార్యకర్తలను కలవరపెడుతున్న ఆగష్టుమాసం
  • కాపు నేతలపై కన్నేసిన కమలనాధులు

హైదరాబాద్‌:

టీడీపీలో మరో ఆగష్టు సంక్షోభం రానుందా… ఏపీతో పాటు ఢిల్లీలో చోటు చేసుకొన్న పరిణామాలు ఆ పార్టీలో గందరగోళానికి కారణమైంది. టీడీపీ ఆవిర్భావం నుండి ఇప్పటికే రెండు దఫాలు ఆగష్టు సంక్షోభాలు చోటు చేసుకొన్నాయి. ఈ దఫా ఆగష్టు కంటే ముందుగానే టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీలో మరో ఆగష్టు సంక్షోభం రానుందా… ఏపీతో పాటు ఢిల్లీలో చోటు చేసుకొన్న పరిణామాలు ఆ పార్టీలో గందరగోళానికి కారణమైంది. టీడీపీ ఆవిర్భావం నుండి ఇప్పటికే రెండు దఫాలు ఆగష్టు సంక్షోభాలు చోటు చేసుకొన్నాయి. ఈ దఫా ఆగష్టు కంటే ముందుగానే టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
1982 మార్చి 29వ తేదీన హైద్రాబాద్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీడీపీ ఆవిర్భవించింది. పార్టని ఏర్పాటు చేసిన 9 మాసాల్లోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్‌ ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసిన తర్వాత గుండె ఆపరేషన్‌ కోసం ఎన్టీఆర్‌ అమెరికాకు వెళ్లారు.
ఆ సమయంలో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కర్‌ రావు నేత త్వంలో తిరుగుబాటు చోటు చేసుకొంది. ఎన్టీఆర్‌ ను గద్దె దింపి నాదెండ్ల భాస్కర్‌ రావు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
అయితే ఈ సమయంలో ఎన్టీఆర్‌కు బీజేపీ, లెఫ్ట్‌ పార్టీలు అండగా నిలిచాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది.సుమారు నెల రోజుల పాటు సీఎంగా ఉన్న నాదెండ్ల భాస్కర్‌ రావు పదవి నుండి తప్పుకొన్నారు. తిరిగి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు.
ముఖ్యమంత్రి పదవి నుండి ఎన్టీఆర్‌ దిగిపోయిన మాసం ఆగష్టు. దీంతో టీడీపీలో తొలిసారి ఆగష్టు సంక్షోభానికి నాంది పడింది. ఆ తర్వాత 1985లో ఎన్టీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో కూడ ప్రజలు మరోసారి ఎన్టీఆర్‌కు అధికారాన్ని కట్టబెట్టారు. 1989లో ఎన్టీఆర్‌ నేతత్వంలోని టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ నేతత్వంలో టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో మితీమీరిన జోక్యం పెరిగిందని ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని లక్ష్మీపార్వతి వర్గం మాత్రం అప్పట్లో ఖండించింది.
లక్ష్మీపార్వతి పెత్తనాన్ని సహించలేక చంద్రబాబు నేత త్వంలో నేతలు తిరుగుబాటు చేశారు. 1995లో ఆగష్టు మాసంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి.చంద్రబాబు నేత త్వంలో ఎమ్మెల్యేలు వైస్రాయి హోటల్‌లో సమావేశమయ్యారు. బాబు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1995 సెప్టెంబర్‌ 1వ తేదీన చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలు మాత్రం టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ వేదికగా కాపు సామాజిక వర్గానికి చెందిన 14 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల సమావేశమయ్యారు. అదే సమయంలో రాజ్యసభలో నలుగురు ఎంపీలు బీజేపీకి అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్యసభ ఛైర్మెన్‌కు లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారని ప్రచారం సాగింది.
ఈ పరిణామాలు మాత్రం టీడీపీలో మరో ఆగష్టు సంక్షోభానికి కేంద్రంగా మారనున్నాయా అనే చర్చ సాగుతోంది. అయితే అప్పట్లో విదేశాల్లో ఉన్న చంద్రబాబునాయుడు ఈ పరిణామాలపై పార్టీకి చెందిన కొందరు నేతలు సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం. దానితో కొంత నష్టనివారణ చర్యలు చేపట్టడంతో కొంత మేలయింది.
టీడీపీకి చెందిన నేతలపై బీజేపీ కన్నేసింది. బీజేపీ నేతలు వ్యూహత్మకంగా టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ అగ్రనేతలు రామ్‌ మాధవ్‌, మురళీధర్‌ రావులు ఏపీకి చెందిన టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టుగా ప్రచారం సాగుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు, ఎంపీలు బీజేపీలో చేరితే టీడీపీపై ఆ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.లిశ్రావణ మాసంలో అంతా సందడే అంటూ బీజేపీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. ఆగష్టు మాసం వస్తోందని టీడీపీ నేతలకు గుబులు పట్టుకొంది. టీడీపీలో ఆగష్టు మాసంలోనే గతంలో సంక్షోభాలు చోటు చేసుకొన్నాయి. ఈ కారణంగానే తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.ఏపీ రాష్ట్రంలో బీజేపీ నేతలు టీడీపీకి గాలం వేస్తున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు రాజ్యసభలో టీడీపీపీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం చేశారు. పలువురు టీడీపీ నేతలకు కూడ బీజేపీ నేతలు వల వేస్తున్నారు.టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆయా ప్రాంతాల్లో బలమున్న నేతలతో బీజేపీ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి టీడీపీ నేతలను బీజేపీలో చేర్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు కూడ కమలం వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.శ్రావణ మాసంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆషాడ మాసంలో మంచి రోజులు లేనందున వలసలకు బ్రేక్‌ పడింది. మంచి ముహుర్తం చూసుకొని బీజేపీలో చేరేందుకు టీడీపీ నేతలు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.శ్రావణ మాసంలో అంతా సందడే ఉంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇక టీడీపీ నేతలకు ఆగష్టు మాసం వస్తోందంటే భయం పట్టుకొంది. ఆగష్టు మాసంలోనే టీడీపీ సంక్షోభాలకు గురైంది. ఎన్టీఆర్‌ను గద్దెదించి నాదెండ్ల భాస్కర్‌ రావు సీఎం పదవిలో కూర్చొంది ఆగష్టులోనే. 1995 ఆగష్టు మాసంలోనే చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ను దించాడు. సెప్టెంబర్‌ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు.ప్రస్తుతం ఆగష్టు మాసంలోనే టీడీపీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో టీడీపీకి మరో ఆగష్టు సంక్షోభం తప్పదా అనే చర్చ కూడ లేకపోలేదు.
టీడీపీతో పాటు వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన అసంత ప్త నేతలపై బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది.ఈ మేరకు టీడీపీకి చెందిన నేతలకు ఆ పార్టీ వల వేస్తోంది.
టీడీపీని మరోసారి ఆగస్టు బూచి వణికిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆగస్టు నెల వస్తుందంటేనే తెలుగు తమ్ముళ్లకు చెమటలు పడతాయి. ఎటు నుంచి ఎవరు పార్టీకి ఎసరు పెడతారన్న అనుమానం వారిని ఆ నెల మొత్తం వేధిస్తుంది. ఎందుకంటే గతంలో అదే నెలలో టీడీపీ జరిగిన సంఘటనలు అలాంటివి మరి.
1983 జనవరి 9వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు, గుండె ఆపరేషన్‌ కోసం 1984లో అమెరికా వెళ్లారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ సహకారంతో టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేతో రామారావును సీఎంగా తప్పించి, తాను సీఎం అయ్యారు నాదెండ్ల భాస్కరరావు. ఇది టీడీపీకి ఆగస్టు నెల పుట్టించిన మొదటి భయం. ఆ తర్వాత రెండుసార్లు అదే నెలలోనే ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. 1984లో రామారావును వెన్నుపోటు రాజకీయం నుంచి తప్పించినట్లుగా చెబుతున్న చంద్రబాబు నాయుడు, స్వయంగా 1995 8వ నెలలోనే వెన్ను పోటు పొడిచారు. వైస్రాయ్‌ హోటల్‌ వేదికగా పార్టీని చీల్చి రామారావును సీఎం పదవి నుంచి తప్పించారు. అలా ఆగస్టు టీడీపీకి చుక్కలు చూపించింది.
ఆ బ్యాడ్‌ సెంటిమెంట్‌ అక్కడితోనే ఆగలేదు. ఎందుకంటే టీడీపీని చేజిక్కించుకున్న చంద్రబాబును కూడా అది వెంటాడింది. 2000 సంవత్సరం ఆగస్టులో జరిగిన బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన, ఆ తర్వాత 2004లో చంద్రబాబు సీఎం పదవికి ఎసరు తెచ్చింది. దీంత గత అనుభవాలు, తనకు ఎదురైన అనుభవాన్ని ద ష్టిలో పెట్టుకున్న చంద్రబాబు, కీలక నిర్ణయాలేవీ ఆ నెలలో తీసుకునే వారు కాదట. ఇక 2009లో కూడా చంద్రబాబు అధికారంలోకి రాకపోవడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన, 2014 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబును ఆగస్టు అంతగా ఇబ్బంది పెట్టలేదు. కానీ పార్టీ శ్రేణుల్లో మాత్రం అనుమానాలు, భయాలు అలాగే ఉన్నాయట.
మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తెలుగుదేశం పార్టీలో మరోసారి సంక్షోభం మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరుగా టీడీపీ నేతలు బీజేపీ వైపు వెళ్లడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో నలుగురు రాజ్యసభ ఎంపీలు నేరుగా బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత 17 మంది ఎంఎల్‌ఏలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటే ఆ పార్టీ పెద్దలు ప్రకటనలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ నేతల భయానికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న 23 మంది ఎంఎల్‌ఏలలో 17 మంది పోతే పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుంది. పార్టీ ఫిరాయించిన వారి మీద చర్యలు తీసుకోడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఉన్న సభ్యుల్లో మూడోవంతు మంది కొత్తగా పార్టీ పెట్టుకున్నా, వేరే పార్టీలోకి వెళ్లినా చట్ట పరంగా వారికి గుర్తింపు ఉంటుంది. అంటే ఒకవేళ ఆ 17 మంది బీజేపీలో చేరితే, ఆ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవలేక పోయినా, నేరుగా బీజేపీకి ఏపీలో ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇదే ఇప్పుడు టీడీపీ నేతల భయం. ఇదంతా అసెంబ్లీ సమావేశాల తర్వాత అంటే ఆగస్టు మొదటి వారంలో జరిగే అవకాశం ఉందనేది తెలుగు తమ్ముళ్ల భయం. అంటే చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీని మరోసారి ఆగష్టు సంక్షోభం వెంటాడుతోందని అర్థం అవుతోంది.
రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న అధికార పార్టీ నేతలు కార్తీక మాసం వరకూ ఆగాల్సిందే. ఇప్పట్లో రాష్ట్ర కేబినెట్‌? విస్తరణ లేదని టీఆర్‌?ఎస్‌? వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 27 దాటితే మంచి రోజుల్లేవు. ఆ లోపు విస్తరణ సాధ్యం కాకపోవచ్చని టీఆర్‌ఎస్‌? వర్గాలు అంటున్నాయి. అక్టోబర్‌లో ఒకటి, రెండు ముహూర్తాలు ఉన్నా అవి అంత ప్రామాణికమైనవి కావని వేద పండితులు చెప్తున్నారు. నవంబర్‌?లో కార్తీక శుద్ధ పంచమితోనే శుభ ముహూర్తాలు ఆరంభమవుతాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పట్లో కేబినెట్‌ విస్తరణకు అవకాశం లేకపోవడంతో నవంబర్‌ వరకు కీలకశాఖలన్నీ సీఎం వద్దే ఉండనున్నాయి. జులైలో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను కూడా కేసీఆరే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.