మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మృతుల గుర్తింపు
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
మృతుల్లో ఇద్దరు చిన్నారులు
ముంబయి, జులై31: మహారాష్ట్ర నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెళి నుండి 140 కిలోవిూటర్ల దూరంలో ఉన్న కాశీల్ గ్రామ సవిూపంలో సతారా వద్ద బెంగళూరు-పుణె ఔటర్‌పై బుధవారం తెల్లవారుజామున 12.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరుమహిళలు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులు సహాయంతో గాయపడినవారిని సవిూపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స నిందించారు. డ్రైవర్‌తో పాటు మరో చిన్నారికి గాయాలు కాగా.. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్ సౌదాగర్ కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కారు నంబర్ కేఏ25ఎంసీ4359 మహీంద్రా ఎస్‌యుబి. ఔటర్‌పై అతివేగంగా వస్తుండటంతో కారు అదుపు తప్పిన క్రమంలో చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో సౌదగర్, అతని భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు మనవళ్ళు ఉన్నారు. మూడేళ్ళలోపు ఉన్న సౌదగర్ మనుమడు, ఐదు సంవత్సరాల మరో మనుమరాలు మృతి చెందిన వారిలో ఉన్నారు. వీరంతా ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. కారు డ్రైవర్ మరో చిన్నారి గాయపడిన వీరు సతారాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ ఇతను పరిస్థితి విషమంగా ఉందని బొర్గాన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సీఎస్ మాలి తెలిపారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న సౌదాగర్ కుటుంబానికి చెందిన బంధువులు ప్రమాద స్థలానికి చేరుకున్నారని తెలిపారు. కాగా మృతదేహాలను కారు వెలికి తీయటానికి రెస్క్యూ టీం, పోలీసులకు మూడు గంటలు పట్టిందని చెప్పారు.