ఉమ్మడి ఆదిలాబాద్‌లో విస్తృతంగా వర్షాలు

గోదావరికి పెరుగుతున్న వరదనీరు
ధర్మపురి వద్ద గోదావరికి ఉదృతంగా వరద
ఆదిలాబాద్‌/కరీంనగర్‌,జూలై30: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకి ఇన్‌ప్లో క్రమక్రమంగా పెరుగుతోంది. మరోవైపు వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లాలోనూ వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది.
మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
ఏర్పడింది. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలో 89.4 మి.విూ., ములు గు జిల్లా తాడ్వాయి మండలంలో 85.4 మిల్లీ విూటర్లు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా భారీ వర్షం పడుతుంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి చెరువులు, వాగులు పొంగిపొర్లుతుండగా కాల్వలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జైనథ్‌ మండలం సాత్నాల ప్రాజెక్టులోకి 299.90 క్యూసెక్కుల ఇన్‌ఎ/-లో కొనసాగుతుండగా, తాంసి మండలం మత్తడి ప్రాజెక్టులో 68 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. కుంటాల, పొచ్చర, కనకాయి జలపాతాలు జలకళను సంతరించు కున్నాయి. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్‌గంగా నది ప్రవాహం పెరిగింది. నార్నూర్‌ మండలం మల్లంగి పంచాయతీ పరిధిలోని బారిక్‌రావుగూడ వద్ద రోడ్డుపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇంద్రవెల్లి మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా చిక్‌మాన్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆదిలాబాద్‌, గుడిహత్నూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లో పంట పొలాల్లోకి వర్షం నీరు నిలిచింది. సిరికొండ మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా ఇచ్చోడ మండలంలో 89.4 మి.విూ. వర్షం కురిసింది. /హమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దహెగాం మండలంలోని ఎర్రవాగు పొంగడం తో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతల మానెపల్లి లో రెండు వాగులు పొంగడంతో రెండు గ్రా మాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కౌటా ల మండలం ముత్యంపేట్‌లో పలు ఇండ్లల్లోకి వరద చేరింది. పెంచికల్‌పేట్‌లోని పెద్దవాగు పొంగడంతో దహెగాం మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. చింతలమానెపల్లి మండలంలో దింద వాగు, రుద్రపూర్‌ వాగు పొంగడంతో దింద, రుద్రాపూర్‌ గ్రామాలకు, బాలాజీ అనుకోడ వాగు పొంగడంతో రవీంద్రనగర్‌కు, దహెగాం మండలంలో ఎర్రవాగు పొంగడంతో తాత్కాలిక వంతెన తెగి తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వేమనపల్లి మండలంలో బద్దవెల్లి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన తెగిపోవడంతో ముల్కలపేట, రాచర్ల, ఎంచపల్లి, జనగామ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం వర్షం పడింది. జగిత్యాల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ధర్మపురి వద్ద గోదావరికి వరద పెరుగుతున్నది. దేవాలయ సిబ్బంది, పోలీసులు భక్తులను లోతు ప్రాంతానికి స్నానాలకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి ప్రవాహంలో బ్రహ్మగుండం, సత్యవతి గుండాలు పూర్తిగా మునిగిపోయాయి. శివపంచాయతనంపై నుంచి గోదావరి ప్రవహిస్తున్నది. ఐదురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి ఉప్పొంగుతున్నది. కరీంనగర్‌ జిల్లాలో నాలుగు రోజులుగా ముసురు పడుతున్నది. సైదాపూర్‌ మండలంలోని సోమారం కల్వర్టు విూదుగా నీరు ప్రవహిస్తున్నది. వీణవంకలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు జలమయమయ్యాయి. చిగురుమామిడి మండలం రేకొండలో 3ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి