Skip to content
Post Views: 678
- అద్దంకిలో వదిలేసి వెళ్లిన కిడ్నాపర్ రవిశంకర్
- హైదరాబాద్ చేరుకొని తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన సోనీ
- హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- వైద్య పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగింత
- ఒంగోలులో పోలీసులకు పట్టుబడిన రవిశంకర్
- హైదరాబాద్ తరలించి విచారణ చేపట్టిన పోలీసులు
- హైదరాబాద్, జులై30: వారం రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్‌లో అపహరణకు గురైన యువతి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ రవిశంకర్ ఆమెను ప్రకాశం జిల్లా అద్దంకిలో వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడి బయల్దేరిన యువతి మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో దిగింది. అక్కడ ఆమె చిన్ననాటి స్నేహితురాలు కలవడంతో ఆమె వద్ద ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎంజీబీఎస్ చేరుకున్న పోలీసులు అమెను హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. వైద్యపరీక్షల అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అనంతరం సరూర్ నగర్ సీసీఎస్‌కు తరలించి విద్యార్థినికి కౌన్సిలింగ్‌ఇచ్చారు.
పోలీసుల అదుపులో రవిశంకర్..
వారం రోజులకు పైగా సోనిని కిడ్నాప్ చేసి కారులో తప్పిన కిడ్నాపర్ రవిశంకర్ సోమవారం అర్థరాత్రి ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద హైదరాబాద్ బస్సు ఎక్కించి వెళ్లారు. కాగా అక్కడి నుంచి రాష్ట్రం
దాటి వెళ్లేందుకు ప్రయత్నించిన రవిశంకర్‌ను ఒంగోలులో రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. గత బుధవారం బొంగులూరు రహదారిపై టీ దుకాణదారు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి.. తన పేరు శ్రీధర్ రెడ్డి అంటూ పరిచయం చేసుకున్నాడు. తన తల్లి వైద్యురాలు.. తండ్రి న్యాయమూర్తి, సోదరుడు పోలీస్ కమిషనర్ అని చెప్పాడు. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దుకాణ యజమానిని నమ్మించాడు. 21 ఏళ్ల తన కుమార్తెకు ఉద్యోగం కావాలని టీ దుకాణం నిర్వాహకుడు కోరాడు. దీంతో ఆ యువకుడు తన కారులో తండ్రీ కుమార్తెను నెక్లెస్ రోడ్డు, సచివాలయం పరిసర ప్రాంతాల్లో తిప్పాడు. తిరిగి వెళ్లే క్రమంలో ధ్రువీకరణ పత్రాల నకలు తేవాలని యువతి తండ్రికి చెప్పాడు. దీంతో అతడు కారు దిగగానే యువతితో పాటు ఆగంతకుడు కారులో పరారయ్యాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఐదు బృందాలుగా ఏర్పడి బెంగళూరు, చెన్నై, విజయవాడ, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. తాజాగా యువతి ఆచూకీ లభ్యం కావడంతో పోలీసులు, ఆమె తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
కిడ్నాప్ అయినట్లు సోనీకి తెలియదా?
హైదరాబాద్ హయత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. సోనీ క్షేమంగా బయటపడింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రవి శేఖర్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో సడెన్‌గా కొత్త ట్విస్ట్ చేసుకుంది. సోనీ స్నేహితురాలు మౌనీక ఇచ్చిన సమాధానంతో కీలక వ్యవహారం బయటపడింది. ఎంజీబీఎస్ బస్టాండ్‌లో సోనీని చిన్ననాటి స్నేహితురాలు మౌనిక కలవగా.. ఆమెకు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఉదయం 5:30కి సోనీ చెప్పినట్లు మౌనీక చెబుతుంది. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. ఉద్యోగం కోసం తిరుపతికి వెళ్లానని మౌనికకు సోనీ చెప్పినట్లు ఆమె వెల్లడించింది. తన ముఖ కవలికలు బట్టి ఆమె అసలు విషయం ఆమెకు తెలియదని అర్ధమవుతుంది అని మౌనీక చెప్పారు. అయితే 3:30 గంటలకు ఎంజీబీఎస్‌కు వచ్చిన సోనీ 5:30 వరకు పోలీసులకు కానీ, తల్లిదండ్రులకు కానీ ఎందుకు ఫోన్ చేయలేదనే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కిడ్నాప్ వ్యవహారం, టీవీలో హడావుడీ సోనీకి తెలియదని మౌనీక వెల్లడించింది. వారం రోజులు పాటు తిరుపతిలోనే ఉన్నానని సోనీ తనకు చెప్పిందని మౌనీక తెలిపింది. సంతకాల కోసం తిరగడం వల్లే వారం రోజులు ఉండవలిసి వచ్చిందని సోనీ తనకు చెప్పిందని మౌనీక చెప్పుకొచ్చింది.
సోనీ కిడ్నాప్ కాలేదని అనుకుంటే 8రోజులు తనకు తెలియకుండా ఎక్కడ తిప్పారు? రవిశేఖర్ ఏం చేశాడు అనే విషయాలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.