ముందుకు కదలని బాసర అభివృద్ది మాస్టర్‌ ప్లాన్‌

ఆమోదం వచ్చినా కదలని అధికారులు? 
నిర్మల్‌,జూలై29: దేశంలో రెండోది.. దక్షిణ భారతదేశంలో ఏకైక దేవాలయంగా పేరొందిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి మహర్దశ పట్టనుంది.. చదువుల తల్లి కొలువై ఉన్న బాసర పుణ్యక్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు పనులకు సంబంధించి పనులు ముందుకు సాగలేదు. సరస్వతీ అమ్మవారి ఆలయ విస్తరణ, దర్శనానికి వచ్చే భక్తుల సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. యాత్రికులకు అన్ని హంగులు, ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. యాదాద్రి విస్తరణ జరుగుతన్న నేపథ్యంలో ఇతర ప్రధాన ఆలయాల అభివృద్దిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పట్లో నిధులు విడుదలయినా మాస్టర్‌ ప్లాన్‌ మేరకు పనులు చేపట్టాల్సి ఉంది. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బాసర ఆలయ అభివృద్ధికి రూ.50కోట్లు మంజారీ చేసింది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, పుణ్యక్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సిఎం కెసిఆర్‌ గతంలోనే హావిూ ఇచ్చారు. బాసర పుణ్యక్షేత్రం అభివృద్ధికి ముందుగా రూ.50కోట్లు మంజూరు చేసారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంతో పాటు పుణ్యక్షేత్రంలో మార్పులు, చేర్పులు చేయడం, వాస్తు ప్రకారం నిర్మించేందుకుగాను స్తపతి గతంలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక ఇంజినీరింగ్‌ పనులకు సంబంధించి ఎఫ్‌హెచ్‌డీ కనస్టక్షన్ర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు కూడా అప్పట్లో పరిశీలించి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50కోట్లతో ఆలయ అభివృద్ధి, మార్పులు, చేర్పులతో ఇతర నిర్మాణాలు, పనులు చేపట్టనున్నారు. బాసర ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు పనులు సాగుతాయని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా అన్నారు. బాసర ఆలయ అభివృద్ధి, విస్తరణకు త్వరలో బృహత్తర ప్రణాళిక రూపొందించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల 
ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బాసర ఆలయ అభివృద్ధి నమూనా విషయంలో సీఎం కేసీఆర్‌ ఆగమ శాస్త్ర పండితుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. తుది డిజైన్‌ ఖరారు చేశాక.. టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి అల్లోల వెల్లడించారు.