మద్యంతో మానవ సంబంధాలు

  • నాశనమైపోతున్నాయి
  • – అక్కాచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చా
  • – మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే
  • – గ్రామాల్లో బెల్టు షాపులు పూర్తిగా మూతపడతాయి
  • – ట్విట్టర్‌లో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి

అమరావతి, జులై25 : ఏపీలో మద్యపాన నిషేధంపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేశారు. మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని వాపోయారు. అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చానని గుర్తు చేశారు. నిషేధం దిశగా అడుగు లేస్తూ బెల్టు షాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చామన్నారు. ఆ విధంగా గ్రామాల్లో బెల్టు షాపులు పూర్తిగా మూతబడతాయని సీఎం జగన్‌ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేసే దిశగా సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారని, ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 1 నాటికి రాష్ట్రంలోని బెల్ట్‌ షాపుల్ని పూర్తిగా ఎత్తివేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలు ఉండొద్దన్నారు. దాబాల్లో కూడా లిక్కర్‌ అమ్మకాలు జరపొద్దన్నారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాలు అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందే అని జగన్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు తొలి విడతలో బెల్ట్‌ షాపులను ఎత్తేయాలని అధికారులకు సూచించారు. బెల్ట్‌ షాపులను ఎత్తేయడం వల్ల ఎంత ఆదాయం తగ్గుతుందో అంచనా వేసి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు.
మద్యపాన నిషేదం ఇదేనా- ట్విట్టర్‌లో లోకేశ్‌ విమర్శలు
మద్యపాన నిషేధం అమలుపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ట్వీట్‌పై మాజీ మంత్రి నారా లోకేశ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయన్న ముఖ్యమంత్రి జగన్‌.. అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదేనంటూ పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం ఏం చెప్పలనుకుంటారోనని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. అలాగే బ్జడెట్‌లో మద్యం అమ్మకాల ఆదాయంపై అంచనాలు గతేడాది కంటే ఎక్కువేశారని, మరి మద్యపాన నిషేధం అంటున్నారని లోకేశ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ అయ్యాయని, ఇసుక వాలంటీర్లు, తర్వాత మద్యం వాలంటీర్లు పండగ చేసుకోండి అంటూ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. మొదటి బ్జడెట్లో మద్యం విూద ఆదాయాన్ని గత ఏడాదికన్నా రూ. 2,297 కోట్లు ఎక్కువ అంచనా వేశారని, ఇప్పుడేమో, ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అంటున్నారని అన్నారు. ఇక మన వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ. ఇసుక వాలంటీర్లు తరువాత, మద్యం వాలంటీర్లు.. పండగ చేసుకోండి’ అంటూ ట్వీట్‌ చేశారు. మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదేనని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారని, అసలింతకీ
విూరు ఏం చెప్పాలనుకుంటున్నారంటూ లోకేశ్‌ ప్రశ్నించారు.