మీకు విజయ్‌ కాదు.. బాబీ కనపడాలి

  • బాబీ జర్నీయే ‘డియర్‌ కామ్రేడ్‌’ 
  • మంచి ఎమోషనల్‌ ట్రీట్‌గా ఉంటుంది 
  • నాకే బోర్‌ కొడుతుంది 
  • ప్రత్యేక ఇటర్య్వూలో విజయ్‌ దేవరకొండ 

యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించిన హీరో విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా అనుహ్యమైన స్థాయిలో క్రేజ్‌ గా మారారు. అతని చరిష్మా ఒక్క టాలీవుడ్‌ లోనే కాదు సౌత్‌ లో కూడా హవా ఓ రేంజ్‌ లో ఉంది. తాజాగా విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం డియర్‌ కామ్రేడ్‌. భరత్‌ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 26న సిద్ధమైంది, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న మొదటి తెలుగు సినిమా ఇదే. ఈ సందర్బంగా హీరో విజయ్‌ దేవరకొండతో మీడియా ముచ్చటించారు… 
డియర్‌ కామ్రేడ్‌ ప్రమోషన్‌ కోసం.. 
డియర్‌ కామ్రేడ్‌ సినిమా నాకు బాగా నచ్చింది. దీన్ని మనమే ప్రమోట్‌ చేసుకోవాలి అని అలోచించి, ఏదైనా కొత్తగా చేయాలనీ అనుకున్నాం. ఒక తెలుగులో మాత్రేమే కాదు కదా .. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదుల చేస్తున్నాం. అన్ని భాషల్లో ప్రమోషన్లో పాల్గొనాలి.. అక్కడకు వెళ్లి .. రొటీన్‌గా ఎదో మాట్లాడితే నాకే బోర్‌ కొట్టేస్తుంది.. పైగా అక్కడికి వచ్సిన ప్రేక్షకు లు కూడా అలాగే ఫీల్‌ అవుతారని అనిపించి.. అలా మ్యూజిక్‌ ఈవెంట్‌గా మార్చేసాం..సినిమాపై చాలా నమ్మకం ఉంది.పైగా మన సినిమా ఇన్ని భాషల్లో విడుదల అవుతుండడం అంటే గ్రేట్‌ కదా.. పైగా ఇప్పటి వరకు ఓ తెలుగు సినిమా నాలుగు భాషల్లో విడుదలైన సినిమా ఏది లేదు. బాహుబలి.. సినిమా కన్నడలో తెలుగే రిలీజ్‌ చేసారు. అయినా బాహుబలితో మన సినిమాను పోల్చుకోలేం .. అది వేరే .. ఇది వేరే. 
మీ స్టార్‌ ఇమేజ్‌ గురించి .. 
ఇమేజ్‌ అన్నది అది ప్రేక్షకుల సైడ్‌ నుండు వచ్చిన ఇమాజినేషన్‌.. నా వరకు మాత్రం విజయ్‌ అంటే ఇలా ఉంటాడు.. అంతే.. ఇమేజ్‌ అన్నదాన్ని చూసుకుని ఎగిరి పడితే దాని ఫలితం ఇంకోలా ఉంటుంది. అందుకే ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోను.. కానీ బాధ్యతగా తీసుకుంటా.. నా వరకు నా పని ఇది, ఇది తప్పకుండ చేయాలంటే అది చేస్తా. కానీ బాధ్యత అప్పుడే ఎందుకు అని అప్పడప్పుడు మరచిపోతా. 
కామ్రేడ్‌ కథ.. 
ఇది బాబీ అని ఓ స్టూడెంట్‌ లీడర్‌ జర్నీ .. దాంతో పాటు లిల్లీ అనే అమ్మాయి ప్రయాణం .. వీరిద్దరి ప్రయాణం ఎక్కడ ఎలా కలిసింది .. వారి జీవితంలో వచ్చిన సమస్యలు ఏమిటి అన్నది కథ. మంచి ఎమోషనల్‌ ట్రీట్‌గా ఉంటుంది. సినిమా చూసాక తప్పకుండా ప్రేక్షకుడు ఆ ఎమోషన్‌ను ఇంటిదాకా తీసుకెళతాడు. డియర్‌ కామ్రేడ్‌ అంటే.. మనకు ఇష్టమైన వాళ్ళను మనం డియర్‌ అని పిలుస్తాం.. అలాగే కామ్రేడ్‌ అంటే మనం సాధించుకోవాల్సిన హక్కుల గురించి మనం పోరాడటం .. అలాగని ఇందులో రాజకీయాలు.. కమ్యూనిజం లాంటివి ఏమి ఉండవు. ఇందులో నా పేరు బాబీ.. అతని తాతగారు కమ్యూనిస్ట్‌ నాయకుడు కాబట్టి.. చిన్నప్పటినుండి ఇంట్లో ఆ విప్లవ భావాలూ ఎక్కువ. అన్యాయాన్ని సహించకపోవడం. తప్పులను ఎత్తిచూపడం అనేది నా నైజం. సైలెంట్‌గా నాపని నేను చేస్తూ ఉండలేను.. అందుకే కాలేజ్‌ లో లీడర్‌గా ఉంటాను. 
రశ్మికతో రెండవసారి నటించడం.. 
అవును .. రష్మిక నేను మంచి ఫ్రెండ్స్‌ .. తనతో ఇది రెండో సినిమా కాబట్టి చాలా ఈజ్‌ గా చేశామ్‌. ఆమెనే కాదు రాహుల్‌ రామక ష్ణ లాంటి వాళ్లతో రెండో సారి చేసినప్పుడు కొన్ని కంఫర్ట్‌ లెవెల్స్‌ పెరగటం తో ఇంకా ఈజీ గా చేస్తాం. ఇందులో తనది లిల్లీ అనే పాత్ర .. చాలా ఎమోషనల్‌ గా ఉంటుంది. మన సోస్సైట్‌ లో ఉన్న పదిమంది అమ్మాయిల్లో తొమ్మిది మంది కథ ఇది. ఇక భారత్‌ చేసిన షార్ట్‌ ఫిలిమ్స్‌ చూసాను .. అతను ఈ కథను అర్జున్‌ రెడ్డి షూటింగ్‌ టైం లో చెప్పాడు .. అప్పటినుండి ఈ కథను ఫాలో అవుతూనే ఉన్నా. నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. భరత్‌ చెప్పినదానికంటే ఇంకా బాగా తీసాడు. 
ముద్దు సన్నివేశాలు .. 
సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అన్నవి ఆయా పాత్రల ఎమోషన్‌ .. అక్కడ ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తున్నాయి.. అన్న విషయంలో నేను కనిపించకూడదు. ఇప్పుడు ఈ సినిమాలో మీకు విజయ్‌ కనిపించకూడదు.. బాబీ కనిపించాలి. అవి కథలను బట్టి, ఆయా పాత్రలను బట్టి ఉంటాయి తప్ప .. కావాలని ముద్దు సన్నివేశాలు హిట్‌అవ్వవు. కొత్త దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నారు. మేము మొదలు పెట్టినప్పుడు కొత్తవాళ్ళమే కదా. ఇక్కడ స్టార్‌ దర్శకులు ఊరికే అవకాశాలు ఇవ్వరు .. మనలను మనం ప్రూవ్‌ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయి. నేను హీరోగా అవ్వాలనుకున్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశా. అప్పుడు మనం ఎవరో ఎవరికీ తెలియదు కదా .. అందుకే మనలా తపన ఉంది దర్శకులుగా అవ్వాలని ప్రయ్నటించే వాళ్ళకోసం చూసా .. అప్పుడే నాకు తరుణ్‌, సందీప్‌, భారత్‌ లు కలిశారు .. వాళ్లతో సినిమా చేయడంతో ఇలా సక్సెస్‌ అందుకున్నాను. 
నెక్స్ట్‌ సినిమాలు 
ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ సినిమా అరవై శతం షూటిగ్‌ పూర్తయింది. దానికి టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు. అలాగే హీరో సినిమా , దాంతో పాటు ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా ఉంటుంది.