దేవాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి బోనాల పండగతో పారిశుద్ద్యం పెంచాలి

కలెక్టర్‌ 
మేడ్చల్‌,జూలై20: జిల్లాలో బోనాల పండుగను పురస్కరించుకొని దేవాలయ పరిసర ప్రాంతాలు, రోడ్లు శుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎంవీరెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలకు రోడ్లు గుంతలమయంగా ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. బోనాలకు ఇబ్బందుల లేకుండా చూడాలన్నారు. జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా నాల్గవ విడుత హరిహరం కార్యక్రమానికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలనిఆదేశించారు. నాల్గవ విడుత హరితహారంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీలు, మానవ హారాలు నిర్వహించి ప్రజలందరికి అవగాహన కల్పించాలని అన్నారు. ఉత్తమ జాతి మొక్కలు ఎంపిక చేసుకొని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అదేవిధంగా హరితహారం కార్యక్రమంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు వ్యాసరచనా పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో రోడ్లకిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. గతంలో నాటిన మొక్కలు చనిపోయినైట్లెతే వాటి స్థానంలో ఈ ఏడాది పెద్ద మొక్కలు నాటించాలన్నారు. ఐకానిక్‌ సైట్‌ లలో సంబంధిత శాఖల అధికారులు పెద్దఎత్తున మొక్కలు నాటాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేపట్టాల్సిన చిన్నపాటి మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి సీజనల్‌ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది సీజనల్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించి, ఇండ్ల పరిసరాల్లో ముకిరి నీరు నిల్వకుండా చూడాలని అన్నారు. వ్యాధులు 
సోకకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.