సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన కలెక్టర్‌ ఎస్సీ హాస్టల్‌లో నిద్ర చేసిన హరికిరణ్‌ చక్రాయపేటలో స్కూళ్ల పరిశీలన

కడప,జూలై19(జ్యోతి న్యూస్):-:-సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో కలెక్టర్‌ హరికిరణ్‌ రంగంలోకి దిగారు. చక్రాయపేట ఎస్సీ హాస్టల్లో గురువారం రాత్రి హాస్టల్‌ నిద్ర చేసిన జిల్లా కలెక్టర్‌ సి.హరి కిరణ్‌, శుక్రవారం ఉదయం నిద్రలేచి హాస్టల్లోనే కాలకఅత్యాలు తీర్చుకున్నారు. వసతి గృహంలో బాత్రూమ్‌, మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు అందరూ బయటికి వెళుతున్నట్లు కలెక్టర్‌ గుర్తించారు. వారం రోజుల్లోగా హాస్టల్‌ బాత్రూంలలో మరుగుదొడ్లను వాడుకలోకి తీసుకురావాలని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎంఇఒ రవీంద్రనాయక్‌కు ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహంలో మధ్యలో నిర్మాణం ఆగిపోయిన బాత్రూంలను వచ్చే శుక్రవారం లోగా పూర్తి చేయాలని, ఆ విధంగా పూర్తి చేయకపోతే భవన యజమాని బాడుగను ఆపివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. హాస్టల్‌ భవన ప్రధాన గేటుకు విద్యుత్‌ సరఫరా అవుతున్నట్టు కలెక్టర్‌ దఅష్టికి రావడంతో వెంటనే గంటలోగా దానిని సరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం హాస్టల్లో విద్యార్థుల స్టడీ క్లాసును పరిశీలించారు. అక్కడ ఏ యే తరగతి విద్యార్థులు ఉన్నారు, వారికి హాస్టల్‌ లో, స్కూల్లో బోధన ఏవిధంగా ఉంది అని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫార్ములాలను, చిన్నచిన్న ప్రశ్నలు వేసి విద్యార్థుల పరిజ్ఞానాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. విద్యార్థులకు రెగ్యులర్‌ అంశాలతో పాటు జనరల్‌ అంశాలలో కూడా బోధన సరిగా చేయాలని ¬టల్‌ వార్డెన్లకు కలెక్టర్‌ సూచనలు జారీ చేశారు. విద్యార్థులు గైడ్స్ను ఫాలో కాకుండా టెస్ట్‌ బుక్‌ లను మాత్రమే చదవాలని, అవగాహనతో చదవడం వల్ల విద్య బాగా వస్తుందని కలెక్టర్‌ విద్యార్థులకు బోధించారు. అనంతరం హాస్టల్లో బాగోలేని పరిస్థితులు, అంశాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని బీసీ బార్సు హాస్టల్‌ను కూడా సందర్శించి అక్కడి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. హాస్టల్లో విద్యార్థులకు రోజు మెనూలో అందిస్తున్న ఆహార పదార్థాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. నూతనంగా నిర్మిస్తున్న భోజనశాల ను పరిశీలించారు. భోజనశాల భవనాన్ని పూర్తి చేయాలని, లైట్లు ఫ్యాన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, చిన్నచిన్న మరమ్మతు లతో పనులు జరుగుతున్నట్టు హాస్టల్‌ వార్డెన్‌ కలెక్టరుకు వివరించారు. పనులను పూర్తి చేసి వెంటనే వాడుక 
లోకి తీసుకురావాలని హాస్టల్‌ వార్డెనుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చక్రాయపేట గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అనంతరం ఉదయం ఏడు గంటలకు ఎస్సీ కాలనీలో కలెక్టర్‌ గ్రామ వాక్‌ చేశారు. గ్రామంలో మూడు అంగన్వాడీ పక్కా భవనాలు పూర్తయి బిల్లులు రాక పోవడం, సగంలో ఆగిపోయిన ఎస్సీ హాస్టల్‌ నిర్మాణం తదితర పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. చక్రాయపేట పంచాయతీ నాగిరెడ్డిపల్లె ఎంపియుపి పాఠశాల ను తిరిగి పున: ప్రారంభించాలని గ్రామస్తులు కలెక్టరును కోరగా, వీటిపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హావిూ ఇచ్చారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను తీసుకొని పరిశీలించిన కలెక్టర్‌, సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్‌ వివరించారు. అనంతరం గండి క్షేత్రంలో ఉన్న ఎపి బాలయోగి గురుకుల పాఠశాలని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. పాఠశాలలోని వంట గదిని, భోజనశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వండిన అల్పాహారాన్ని తిని నాణ్యతను, రుచిని చూసి కలెక్టర్‌ సంతృప్తిని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యాబోధన తీరును జిల్లా కలెక్టర్‌ 
హరికిరణ్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సత్యానందం, ఎఎస్‌డబ్ల్యుఒ బి.గురు ప్రసాద్‌, ఎస్సీ, బీసీ హాస్టల్‌ వార్డెన్లు జి.నాగేశ్వరరావు, కె.అయ్యవారు రెడ్డి, మాజీ సర్పంచ్‌ పెద్ద రామయ్య, ఎంపిడిఒ, వెలుగు ఎపిఎంలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గన్నారు.