వ్యవసాయ అవగాహన సదస్సులు వెనక్కి మళ్లీ మొదటికొచ్చిన అధికారులు

వరంగల్‌,జూలై 19(జ్యోతి న్యూస్):-:-వ్యవసాయంలో రైతులకు మెళకువలపై ప్రతియేటా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సదస్సులను నిర్వహించేవారు. సాగులో సలహాలు, సూచనలతో పాటురైతు సదస్సుల ద్వారా విస్తృతపరిచేవారు. రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మన తెలంగాణ?మన వ్యవసాయ కార్యక్రమం ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతోపూర్తిగా నీరుగారిపోతుంది. 2018 ఖరీఫ్‌ నుంచి ఈ రైతు సదస్సులను నిర్వహించిన దాఖలాలు లేవు. మారుతున్న వాతావరణ పరిస్థితు లకు అనుగుణంగా ఎలాంటి పంటలు పండించుకోవాలన్నఅవగాహన కొరవడింది. గతంలో మన 
తెలంగాణ మన వ్యవసాయం పేరిట గ్రామాల్లో రైతు చైతన్య సదస్సుల నిర్వహణను నిర్వహించారు. ప్రస్తుతం రెండేళ్ల నుంచి రైతు సదస్సుల ఊసే లేకుండా పోయింది. ఏటా ఖరీఫ్‌కు నెల ముందువ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అనుబంధ శాఖల సమక్షంలో సూచనలు అందించి సాగుకు రైతులను సన్నద్ధం చేసేవారు. కానీ వ్యవసాయశాఖ అధికారులు సలహాలు, సూచనలు రైతులకు అందకతీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కొంతమంది రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలపై అవగాహన ఉండటం లేదు. రైతులు ఎక్కువగా రసాయన ఎరువులను వాడడంతో భూముల్లోనిభూసారాన్ని కోల్పోతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరిగి దిగుబడి అంతంత మాత్రమే వస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వ్యవసాయశాఖతోపాటు పశుసంవర్ధక, ఉద్యానవన పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, మార్కెటింగ్‌, అటవీ, బ్యాంకింగ్‌, రెవెన్యూ, విద్యుత్‌, సూక్ష్మ నీటి సేద్యం, నీటిపారుదల శాఖ తదితర శాఖలున్నాయి. శాఖల ద్వారా రైతులకు ప్రయోజనాలు రాయితీ తదితరఅంశాలపై అవగాహన కల్పించేవారు.