నాలుగు మున్సిపాలిటీల్లో మహిళలదే పైచేయి వారికే రిజర్వ్ అయ్యే అవకాశాలు
నిజామాబాద్,జూలై19(జ్యోతి న్యూస్):-:-రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసిన ఎన్నికలను నిర్వహించే విధంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మాత్రం మహిళల ఓటర్లదే పైచేయిగా ఉంది. న్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ జాబితాల ఆధారంగానే ఎన్ని కలనునిర్వహించనున్నారు. మొత్తం నాలుగు మున్సిపాలిటీల పరిధిలో బీసీలతో పాటు మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్ని కలలాగానే ఈఎన్నికలలో కూడా మహిళల ఓటర్లు అధికంగా ఉన్నారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా వారే ఎక్కువగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ లలో యాభై శాతం రిజర్వేషన్ ఉండడం వల్ల వచ్చే ఎన్నికల్లో వారికే ఎక్కువగా అవకాశాలు రానున్నాయి. గత మున్సిపల్ ఎన్నికలలో నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్ మున్సిపల్ మేయర్, ఛైర్మన్ పదవులు వారికే రిజర్వ్ అయ్యాయి. ఈ దఫా నాలు గు మున్సిపాలిటీలలో రెండు వారికే రిజర్వ్ అయ్యే అవకాశాలుకనిపిస్తున్నాయి. బీసీ జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఈ దఫా ఎక్కువ మున్సిపాలిటిలలోని పదవులపై ఆ వర్గం వారు కన్నేశారు. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో అధికారులుఎన్నికలకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే వార్డుల పునర్విభజన చేసిన అధికారులు ఓటరు జాబితాను ప్రకటించారు. సిబ్బంది శిక్షణలో నిమగ్నం అయ్యారు.రాష్ట్ర ఎన్నికలసంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు మున్సిపల్ ఎన్నికల కు సిద్ధం అవుతున్నారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం 2,99,261 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,52,583 మంది ఉన్నారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఓటర్లు 62,448 మంది ఉండగా, స్త్రీ ఓటర్లు 31, 633 మంది ఉన్నారు. ఈ మున్సిపాలిటీ
పరిధిలో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎ క్కువగా ఉన్నారు. భీమ్‌గల్ మున్సిపాలిటి పరిధిలో మొత్తం ఓటర్లు 11,349 మంది ఉండగా స్త్రీ ఓటర్లు 5895 మంది ఉన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటిలో మొత్తంఓటర్లు 54, 808 మంది కాగా వారిలో స్త్రీ ఓటర్లు 28,271 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఆర్‌వోలు, ఏఆర్ వోలతోపాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణను ఇచ్చారు. బ్యాలెట్ బాక్సులను సమకూర్చారు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు.