బొప్పాయితో బోలెడు లాభాలు
బొప్పాయి పండు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పండుకు సులువుగా ఇంట్లో దొరికే ఇతర పదార్థాలను కలిపితే సౌందర్యం ఇనుమడిస్తుంది. బొప్పాయి పండు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పండుకు సులువుగా ఇంట్లో దొరికే ఇతర పదార్థాలను కలిపితే సౌందర్యం ఇనుమడిస్తుంది. కొద్దిగా బియ్యప్పిండి తీసుకొని అందులో బొప్పాయి గుజ్జుని చేర్చితే ఒక మిశ్రమంగా తయారవుతుంది. దీనిని ముఖ చర్మానికి రాసుకుంటే మొటిమలు మాయమవడంతోపాటు చర్మం కాంతివంతంగా తయారవుతుంది. బొప్పాయిగుజ్జులో ఒక చెంచా పచ్చిపాలు, తేనె, పసుపు, తులసి ఆకుల చూర్ణం కలుపుకొని ముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు తగ్గుతాయి. బొప్పాయి పండు గుజ్జు, అర స్పూన్ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి రాసుకుంటే చర్మానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అంది యవ్వనంగా కనిపిస్తారు. నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయను మీ సొంతం చేసుకున్నట్టే. బొప్పాయి పండుకి ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది.కోడిగుడ్డులోని తెల్లసొన కొద్దిగా తీసుకొని ఒకస్పూన్ బొప్పాయి గుజ్జుతో బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఒక అరగంట సేపు అలానే ఉంచుకొని ఆరిన తర్వాత ముఖాన్ని చన్నీళ్ళతో కడిగేసుకోవాలి.
-కొద్దిగా బియ్యప్పిండి తీసుకొని అందులో బొప్పాయి గుజ్జుని చేర్చితే ఒక మిశ్రమంగా తయారవుతుంది. దీనిని ముఖ చర్మానికి రాసుకుంటే మొటిమలు మాయమవడంతోపాటు చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
-బొప్పాయిగుజ్జులో ఒక చెంచా పచ్చిపాలు, తేనె, పసుపు, తులసి ఆకుల చూర్ణం కలుపుకొని ముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు తగ్గుతాయి.
-బొప్పాయి పండు గుజ్జు, అర స్పూన్ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి రాసుకుంటే చర్మానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అంది యవ్వనంగా కనిపిస్తారు.
-నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయను మీ సొంతం చేసుకున్నట్టే.
– బొప్పాయి పండుకి ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది.
కోడిగుడ్డులోని తెల్లసొన కొద్దిగా తీసుకొని ఒకస్పూన్ బొప్పాయి గుజ్జుతో బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఒక అరగంట సేపు అలానే ఉంచుకొని ఆరిన తర్వాత ముఖాన్ని చన్నీళ్ళతో కడిగేసుకోవాలి. బొప్పాయిపాలను చర్మంపై రాస్తే తామర, గజ్జి, మొదలగు అంటువ్యాదులు తొలగిపోతాయి.
-ఈ బొప్పాయి పాలలో కొంచెం పంచదార కలిపి, ఒక స్పూన్ చొప్పున రోజుకు మూడుపూటలా తీసుకోవడం చేత గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు పోతాయి.
-బొప్పాయి పాలను తేలు కుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది.
విత్తనాలను ఇలా కూడా వాడొచ్చు
-బొప్పాయి విత్తనాలను పొడి చేసుకుని కొంచం నెయ్యిని కలుపుకొని తీసుకుంటే కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోతాయి.
-కొన్ని దేశాలలో మిరియాలకి బదులుగా ఈ బొప్పాయి విత్తనాలనే వంటల్లో వాడుతున్నారు.
బొప్పాయి ఆకు ఒక మంచి ఓషదం:
డెంగ్యూ వచ్చిన వారికి ప్లేట్లెట్ ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ బొప్పాయి ఆకుల రసాన్ని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్ ల సంఖ్య పెరిగి, త్వరగా వ్యాధి నుండి కోలుకుంటారు.