చంద్రయాన్-2 వాయిదా
సాంకేతిక సమస్యలతో ఆగిన చంద్రయాన్-2
56 నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపిన ఇస్రో
వారాలు కావచ్చు : ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సిద్ధార్థ
శ్రీహరికోట, ధీర ప్రతినిధి: జాబిల్లి యాత్ర ‘చంద్రయాన్-2’ సోమవారం తెల్లవారు జామున అనూహ్యంగా ఆగిపోయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 వాహకనౌక అయిన ‘జీఎస్‌ఎల్వీ మార్క్3’లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసింది. ఈ ప్రయోగం 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపేశారు. మళ్లీ ఈ ప్రయోగాన్ని వారాలు పట్టోచ్చు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సిద్ధార్థ చెప్పారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు షార్ నుంచి ‘జీఎస్‌ఎల్వీ మార్క్3-ఎం1’ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి లోపు కేవలం 16.13 నిమిషాల వ్యవధిలో చంద్రయాన్-2ను ఆగ్గింది. తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రయోగించలేకపోతే మళ్లీ అనువైన సమయం వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే. ప్రస్తుత లాంచ్ విండో(సోమవారం తెల్లవారుజాము)లో ప్రయోగాన్ని పూర్తిచేసేందుకు ఇస్రో తీవ్రంగా శ్రమించినప్పటికీ నిరాశే ఎదుర్కొన్నారు. చంద్రయాన్ 2ను వీక్షించాడానికి తిరుమల వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో షార్‌కు వచ్చారు. ఇందులో రూ.629 కోట్లతో నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం రెండో ప్రయోగ వేదిక వద్దకెళ్లి చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని పంపనున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్3-ఎం1 వాహక నౌకను వీక్షించారు. అనంతరం అక్కడ నుంచి మళ్లీ నక్షత్ర అతిథి భవనానికి చేరుకొని, రాత్రి బస చేశారు.
వారాలు కావచ్చు : ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సిద్ధార్థ
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం తాత్కాలికంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. కొన్ని సమస్యలు తలెతడంతో ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా మిడియాతో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త బి.జి.సిద్ధార్థని మాట్లాడారు. గతంలో రష్యా, అమెరికాలో కూడా ఇలా జరిగిందన్నారు. క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్‌లో స్వల్ప లీక్ జరిగినట్లు తేలిందని, అయితే ఎందుకు లీక్ జరిగిందో విశ్లేషించాలని ఆయన అన్నారు. పేలోడ్ ఎక్కువగా ఉన్నందున ఈ ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ పనికిరాదని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-2 ప్రయోగానికి మరి కొన్ని వారాలు పట్టవచ్చని ఆయన తెలిపారు.