రైల్వేని ప్రైవేటీకరించం ఆలోచన లేదు
న్యూఢిల్లీ: రైల్వేల ప్రైవేటీకరణ ఆలోచన లేదని, ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా ఆందోళన చెందుతున్నాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. సాంకేతికత, కొత్త లైన్లు, నూతన ప్రాజెక్టులను చేపట్టడానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. జాతీయ ప్రయోజనాలను ద ష్టిలో ఉంచుకొనే తాము ఈ చొరవ తీసుకుంటున్నామని, ఇంతమాత్రానికి రైల్వేలను ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించడం తగదన్నారు. శుక్రవారం లోక్‌సభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ రైల్వేలో మౌలిక వసతుల కల్పన, భద్రతా ప్రమాణాలపై మోదీ ప్రభుత్వం రాజీపడటం లేదని, ఈ రంగాల్లో గత యూపీఏ ప్రభుత్వం చేసిన క షి కన్నా తమ ప్రభుత్వం ఎక్కువ క షి చేస్తున్నదని చెప్పారు. ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ పెట్టకపోవడం సరైనదేనన్నారు. రైల్వే బడ్జెట్ కాస్త రాజకీయ బడ్జెట్‌గా మారింది. ఎన్నికల్లో గెలువడానికి కొత్త రైళ్లు, రైల్వే లైన్లను ప్రకటించి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలుకడానికే మేము రైల్వే బడ్జెట్‌ను బంద్ చేశాం అని పీయూష్ అన్నారు.
దీంతో విపక్ష సభ్యులు కలుగజేసుకుంటూ రైల్వేని ప్రైవేటీకరించే ఆలోచనలను విరమించుకోవాలని నినాదాలు చేశారు. దీంతో మంత్రి స్పందిస్తూ మళ్లీ మళ్లీ చెబుతున్నా.. రైల్వే ప్రైవేటీకరణ ఆలోచన లేదు. ముందు మీరు ఆ ఆలోచన నుంచి బయటపడండి. రైల్వేను ఉన్నతంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించాం.కొన్ని యూనిట్లను కార్పొరెటైజ్ చేస్తున్నాం అని తెలిపారు. పీయూష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ రైల్వేమం త్రి అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆర్థికం గా వెనుకబడిన (ఈబీసీ) విద్యార్థులకు 4,800 ఎంబీబీఎస్ సీట్లను రిజర్వ్ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పా రు. నీట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 75వేల సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది మార్చినాటికి దేశవ్యాప్తంగా 19.47 లక్షలకుపైగా అలోపతి, ఆయుర్వేద, యునాని, హోమియోపతి డాక్టర్లు ఉన్నారన్నారు.
దానంతటదే అభివ ద్ధి చెందితే మనమెందుకు?
కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతి ఐదేండ్ల కోసారి దానంతట అదే రెట్టింపు అవుతుందని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం పేర్కొన్నారని, కానీ యూపీఏ పాలనలో అలా జరుగలేదని, పైగా కుంభకోణాలు జరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. చిదంబరం చెప్పినట్లు ప్రతి ఐదేండ్ల కోసారి దేశ ఆర్థిక వ్యవస్థ దానంతట అదే రెట్టింపు అయితే ఇక మనమంతా ఇక్కడ ఎందుకు? దేశంలో ప్రభుత్వం అవసరం ఏముంది? యూపీఏ పాలనలో ఆర్థిక వ్యవస్థ మీద ద ష్టి సారించారా? మీ ద ష్టి అంతా కుంభకోణాలపైనే.. అందుకే యూపీఏ హయాంలో కుంభకోణాలు చోటుచేసుకున్నాయి అని చిదంబరానికి నిర్మల కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటానికి తాము పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. బడ్జెట్‌పై చిదంబరం లేవనెత్తిన అభ్యంతరాలపై అంశాల వారీ సమాధానం చెప్పడానికి తాను సిద్ధమన్నారు.